Share News

శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం

ABN , Publish Date - Oct 31 , 2026 | 11:33 PM

శ్రీశైల క్షేత్రంలో మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్ల స్వర్ణ రథోత్సవాన్ని శనివారం వైభవంగా నిర్వహించారు.

శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం
ఆలయ మాడవీధిలో స్వర్ణ రథోత్సవంలో పాల్గొన్న అధికారులు

శ్రీశైలం, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల క్షేత్రంలో మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్ల స్వర్ణ రథోత్సవాన్ని శనివారం వైభవంగా నిర్వహించారు. ఆరుద్ర నక్షత్ర పర్వదినం సందర్భంగా తెల్లవారుజామున స్వామికి అర్చక వేదపండితులు మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకంతో పాటు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం గంగాధర మండపం వద్దకు పల్లకీలో వచ్చిన ఆది దంపతులకు శాస్త్రోక్త పూజలు నిర్వహించి స్వర్ణరథంపై ఆశీనులుజేశారు. గంగాధర మండపం నుంచి నంది ఆలయం వరకు జరిగిన రథోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రథోత్సవ ప్రారంభంలో లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పం పఠించిన వేదపండితులు దేశంలో అతివృష్టి, అనావృష్టి లేకుండా సకాలంలో వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 31 , 2026 | 11:33 PM