ఘనంగా ఆరుద్రోత్సవ పూజలు
ABN , Publish Date - Jan 03 , 2026 | 11:35 PM
మహానంది క్షేత్రంలోని స్వయం భూలింగానికి ఆలయ వేదపండితులు, అర్చక బృందం ఘనంగా ఆరుద్రోత్సవ పూజలను శనివారం నిర్వహించారు.
మహానంది, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): మహానంది క్షేత్రంలోని స్వయం భూలింగానికి ఆలయ వేదపండితులు, అర్చక బృందం ఘనంగా ఆరుద్రోత్సవ పూజలను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన ఆలయంలో గణపతి పూజ, పుణ్యహవాచనాలతో పాటు ఆలయాన్ని శుద్ధి చేశారు. అనంతరం 200 కేజీల అన్న ప్రసాదాన్ని ఆలయం వద్దకు చేర్చి అన్నాభిషేకం నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేక పల్లకిలో ఉత్తర ద్వారం వద్దకు తీసుకొచ్చారు. ప్రత్యేక పూజలను వేదమంత్రాలతో నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, దాతలు పాల్గొన్నారు.