రహదారిపైనే ఆరబోత
ABN , Publish Date - May 01 , 2026 | 12:18 AM
తెలిసో, తెలియకో కొందరు రైతులు రహదారిపై ధాన్యం ఆరబోస్తున్నారు. ప్రధాన రహదారిపైనే ఇలా ఆరబోస్తుండటంతో వాహనదారులకు ప్రమాదం పొంచి ఉంది.
వాహనదారులకు పొంచి ఉన్న ప్రమాదం
సంజామల, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): తెలిసో, తెలియకో కొందరు రైతులు రహదారిపై ధాన్యం ఆరబోస్తున్నారు. ప్రధాన రహదారిపైనే ఇలా ఆరబోస్తుండటంతో వాహనదారులకు ప్రమాదం పొంచి ఉంది. సంజామల, ముదిగేడు డబల్ రోడ్డు సగం ధాన్యం ఆరబోతకు వినియోగిస్తున్నారు. వాహనాలు ధాన్యంపైకి రాకుడా పెద్ద పెద్ద బండరాళ్లు అడ్డుగా పెట్టారు. రాత్రివేళల్లో వాహనదారులకు ఈ రాళ్లు కనపడక ప్రమాదాలకు గురవుతున్నారు. పోలీసులు రైతులకు అవగాహన కల్పించి, రహదారిపై ధాన్యం ఆరబోయకుండా చూడాలని వాహనదారులు కోరుతున్నారు.