Share News

ప్రజారోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యం: మంత్రి

ABN , Publish Date - May 03 , 2026 | 11:06 PM

ప్రజారోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ తెలిపారు.

ప్రజారోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యం: మంత్రి
సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును అందజేస్తున్న మంత్రి ఫరూక్‌

నంద్యాల రూరల్‌, మే 3 (ఆంధ్రజ్యోతి): ప్రజారోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ తెలిపారు. మండలంలోని పెద్దకొట్టాల గ్రామానికి ఆది వారం వెళ్లి బాధితురాలు అనపురెడ్డి ప్రభావతికి రూ.30 వేలు సీఎం రీలిఫ్‌ ఫండ్‌ చెక్కును స్వయంగా అందజేశారు. మంత్రి మాట్లాడుతూ స్థోమతకు మించి వైద్య ఖర్చులు భరించాల్సి వచ్చిన వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ఒక వరం అని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో నంద్యాల మార్కెట్‌ యార్డు చైర్మన్‌ గుంటుపల్లి హరిబాబు, టీడీపీ నాయకులు శివనాగిరెడ్డి, ప్రేమనాథ్‌రెడ్డి, రాజేశ్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 03 , 2026 | 11:06 PM