Share News

ఉద్యోగావకాశాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం

ABN , Publish Date - Aug 20 , 2026 | 12:32 AM

నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి కే.శ్రీనివాసులు విమ ర్శించారు.

ఉద్యోగావకాశాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం
ధర్నా చేస్తున్న నిరుద్యోగులు, ఏఐవైఎఫ్‌ నాయకులు

కర్నూలు ఎడ్యుకేషన, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి కే.శ్రీనివాసులు విమ ర్శించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట నిరుద్యోగులు, ఏఐవైఎఫ్‌ నాయకులు ధర్నా చేశారు. శ్రీనివాసులు మాట్లాడుతూ నరేంద్ర మోదీ అధికారంలోకి వస్తే 2 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారం చేపట్టి 12 ఏళ్లు పూర్తవుతున్నా ఉద్యోగ, ఉపాధి అవ కాశాలు కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైన బ్యాంకింగ్‌, రైల్వే, బీఎస్‌ఎనఎల్‌, ఎల్‌ఐసీ, ఓడరేవులను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెబితే ఉన్న ఉద్యోగాలు పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సంపద సృష్టించి 20 లక్షల ఉద్యోగావకాశాలు కల్పిస్తా మని, లేనిపక్షంలో ప్రతి నిరుద్యోగికి రూ.3వేలు భృతి ఇస్తామని హామీని తుంగలో తొక్కారన్నారు. పోలీసు శాఖలో 11,639 పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ నోటిఫికేషన ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని ఆరోపిం చారు. సెప్టెంబరు ఒకటిన చలో ఢిల్లీ నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలతో అమీతుమీ తేల్చుకుంటామని హెచ్చరించారు. జిల్లా సహాయ కార్యదర్శి భీసన్న, రాజీవ్‌, రాజు మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు మండ లాన్ని ప్రాథమిక కారిడార్‌ అని, పారిశ్రామిక హబ్‌ అని తీయని పేర్లతో పిలుస్తున్నారే తప్ప.. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలే కపోతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్‌ జిల్లా కమిటీ సభ్యు లు పెద్దయ్య, అంజి, రాజు, సిద్దు, నిరుద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - Aug 20 , 2026 | 12:33 AM