Share News

మాతా శిశు ఆరోగ్యంపై ప్రభుత్వం దృష్టి

ABN , Publish Date - Jan 18 , 2026 | 01:01 AM

మాతా శిశు ఆరోగ్యం పట్ల ప్రభుత్వం దృష్టి పెట్టిందని జిల్లా సంచార చికిత్స కార్యక్రమం నోడల్‌ అధికారి డా. రఘు అన్నారు

మాతా శిశు ఆరోగ్యంపై ప్రభుత్వం దృష్టి
వ్యాక్సినేషన్‌ను పరిశీలిస్తున్న నోడల్‌ అధికారి డాక్టర్‌ రఘు

జిల్లా సంచార చికిత్స నోడల్‌ అధికారి రఘు

కర్నూలు హాస్పిటల్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): మాతా శిశు ఆరోగ్యం పట్ల ప్రభుత్వం దృష్టి పెట్టిందని జిల్లా సంచార చికిత్స కార్యక్రమం నోడల్‌ అధికారి డా. రఘు అన్నారు. శనివారం నగరంలోని కొత్తపేట అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ను తనిఖీ చేశారు. హైరిస్క్‌ గర్భిణులను ఆరోగ్య కార్యకర్తలు క్రమంగా పర్యవేక్షించాలన్నారు. వైద్యుడు సూచించిన ప్రసవం తేదీ ప్రకారం రోజూ ఆరోగ్య స్థితిగతులను కనుగొని అవసరమైన సలహాలు ఇవ్వాలన్నారు. గర్భం దాల్చిన దగ్గర నుంచి బిడ్డకు 16 సంవత్సరాలు వచ్చే వరకు పిల్లలకు అన్ని రకాల టీకాలను జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ, సచివాలయాల్లో ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా అందిస్తుందన్నారు. చిన్నారులకు టీకాలు సకాలంలో ఇవ్వాలని, అప్పుడే వారు ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఆరోగ్య కార్యకర్తలు భువనేశ్వరమ్మ, కళ్యాణి, ప్రాజెక్షనిస్టు ఖలీల్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2026 | 01:01 AM