Share News

రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి

ABN , Publish Date - May 16 , 2026 | 12:17 AM

రాష్ట్రాభిృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని, రాష్ట్రంలోని రహదారులు గుంతలమయం లేకుండా చేసేందుకు రూ.3వేల కోట్లతో పూర్తి చేశామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు.

రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి
రహదారిని ప్రారంభిస్తున్న మంత్రి బీసీ, ఎమ్మెల్యే బుడ్డా

రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

మహానంది, మే 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాభిృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని, రాష్ట్రంలోని రహదారులు గుంతలమయం లేకుండా చేసేందుకు రూ.3వేల కోట్లతో పూర్తి చేశామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం మహానంది క్షేత్రం నుంచి బోయలకుంట్ల మెట్ట వరకు రూ.7.90 కోట్ల నిధులతో నిర్మించిన రహదారిని రాష్ట్ర మంత్రితో పాటు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో గుంతలు లేని రహదారులను నిర్మిస్తామని చెప్పారు. రూ.2 వేల కోట్లతో బ్రిడ్జిల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపుతామని చెప్పారు. ఇందులో మహానంది మండలం బుక్కాపురం అలుగుకు రూ.2.50 కోట్లతో కేటాయిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కేసీ కెనాల్‌ ప్రాజెక్ట్‌ అధ్యక్షుడు బన్నూరు రామలింగారెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు శివకుమార్‌చౌదరి, క్లస్టర్‌ ఇన్‌చార్జి చంద్రమౌళీశ్వరరెడ్డి, టీడీపీ జిల్లా ఉపాఽధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి, తెలుగుగంగ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్‌ క్రాంతికుమార్‌, మాజీ ధర్మకర్త మల్లికార్జునరావు, మహేశ్వరరెడ్డి, రంగస్వామి, రాముడుగౌడ్‌ పాల్గొన్నారు.

మహానందిలో రాష్ట్ర మంత్రి పూజలు: మహానంది క్షేత్రంలో శుక్రవారం సాయంత్రం రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ప్రత్యేక పూజలు జరిపారు. వీరికి ఆలయ ముఖద్వారం వద్ద ఈవో నల్లకాల్వ శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం మంత్రి, స్ధానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డితో కలసి ప్రధాన ఆలయాల్లో స్వామి,అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Updated Date - May 16 , 2026 | 12:17 AM