Share News

రైతులకు అండగా ప్రభుత్వం

ABN , Publish Date - Jun 21 , 2026 | 12:21 AM

టీడీపీ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్ధన్‌ రెడ్డి పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని ఇందిరా ఫంక్షన్‌ హాల్‌లో అన్నదాత సుఖీభవ నిధులు విడుదల కార్యక్రమం నిర్వహించారు.

రైతులకు అండగా ప్రభుత్వం
మాట్లాడుతున్న మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి

మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

అన్నదాత సుఖీభవ పంపిణీ

కోవెలకుంట్ల, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): టీడీపీ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్ధన్‌ రెడ్డి పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని ఇందిరా ఫంక్షన్‌ హాల్‌లో అన్నదాత సుఖీభవ నిధులు విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రి బీసీ జనార్ధన్‌ రెడ్డి హాజరయ్యారు. వ్యవసాయశాఖ ఏర్పాటు చేసిన స్లాళ్లలో యంత్రాలను, పరికరాలను మంత్రి పరిశీలించారు. సాగు కోసం రైతులు ఇబ్బందులు పడకుండా, సీఎం చంద్రబాబు రూ.7వేలను జమ చేశారన్నారు. భూమి ఉన్న రైతులంతా సమీప రైతు సేవాకేంద్రానికి వెళ్లి వివరాలు తెలుసోవాలన్నారు. భూసార పరీక్షలు చేయించుకుని అధికారుల సలహాల మేరకు పంటలను సాగు చేయాలని సూచించారు. రాయలసీమను హార్టికల్చర్‌ హబ్‌గా మార్చేందుకు సీఎం ప్రత్యేక నిధులు విడుదల చేశారన్నారు. ప్రకృతి వ్యవసాయంతో పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువతో పాటు రైతులు, ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఆయన చెప్పారు. జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు, కేవీకే కో ఆర్డినేటర్‌ ధనలక్ష్మి, ఆళ్ళగడ్డ డీఎస్పీ శ్రీనివాసరావు, బనగానపల్లె ఆర్‌డీవో నరేంద్రనాధ్‌ రెడ్డి, ప్రకృతి వ్యవసాయ అధికారులు శ్రీనివాసులు, బనగానపల్లె మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ కాట్రెడ్డి మల్లికార్జున్‌ రెడ్డి, సొసైటీ చైర్మన్‌ గువ్వల సుబ్బారెడ్డి, గడ్డం నాగేశ్వర్‌ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఎస్‌ఎ గపూర్‌, సౌదరదిన్నె సుబ్బారెడ్డి, బిజనవేముల హుస్సేనయ్య, వెలగటూరు ధనుంజయుడు, లింగాల సొసైటీ చైర్మన్‌ ఏవి సుబ్బారెడ్డి, కోవెలకుంట్ల మార్కెట్‌ యార్డ్‌ వైస్‌ చైర్మన్‌ విష్ణు శేఖర్‌ రెడ్డి, ముక్కమల్ల చంద్రశేఖర్‌ రెడ్డి, కంపమల్ల సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఆలయ ఆధునీకరణకు చర్యలు

బనగానపల్లె: పట్టణంలోని పురాతనమైన ఆంజనేయస్వామి ఆలయ పునరుద్దరించడానికి రూ.3 కోట్లతో ప్రణాళికలు సిద్దం చేయాలని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి కోరారు. శనివారం జిల్లా దేవదాయశాఖ అధికారి పాండురంగారెడి, ఈవో బ్రహ్మానందారెడ్డితో కలసి ఆంజనేయస్వామి ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఆధునీకరణం చేయడానికి నివేదికలు సిద్దం చేయాలని ఆదేశించారు. డీఈ నాగశ్రీనివాసులు, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఏఈ సాయికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 21 , 2026 | 12:21 AM