మైనార్టీల విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి
ABN , Publish Date - Jul 06 , 2026 | 11:30 PM
మైనార్టీల విద్యాభి వృద్ధికి ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ తెలిపారు.
న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్
నంద్యాల రూరల్, జూలై 6 (ఆంధ్రజ్యోతి): మైనార్టీల విద్యాభి వృద్ధికి ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ తెలిపారు. మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉర్దూ మీడియంలో ముద్రించిన టెట్- 2006 స్టడీ మెటీరియల్‌ను సోమవారం పట్టణంలోని రాజారెడ్డి ఫంక్షన్ హాల్‌లో పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. మైనార్టీలు అన్ని రంగాల్లో రాణిం చాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉర్దూ మీడియం విద్యార్థులు, ఉపాధ్యాయుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్, రామచంద్రరావు, అంజాద్‌బాషా, హుసేని, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.