Share News

‘ఉద్యాన’ అభివృద్ధికి ప్రభుత్వం కృషి

ABN , Publish Date - Oct 01 , 2026 | 12:20 AM

ఉద్యాన రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.

‘ఉద్యాన’ అభివృద్ధికి ప్రభుత్వం కృషి
రైతులకు శనగ విత్తనాలను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

కల్లూరు, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): ఉద్యాన రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. బుధవారం చిన్నటేకూరులో నిర్వహించిన తోట పాఠశాల కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిఽథిగా హాజరయ్యారు. వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక శాఖల్లో అమలు చేస్తున్న పథకాలపై రైతులకు అవగాహన కల్పించారు. గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ అక్టోబరు 2న మదనపల్లెలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌ ప్రారంభం చేయనున్నట్లు తెలిపారు. ఉద్యాన రైతులకు ఎంతో ఉపయోగకరమని, ఆధునిక సాంకేతక పరి జ్ఞానం, ఉత్పత్తుల సేకరణ, నిల్ల, ప్రాసెసింగ్‌, మార్కెటింగ్‌ వంటి అంశా ల్లో రైతులకు సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. అనంతరం రైతు లకు శనగ, పశుగ్రాస విత్తనాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కార్యక్ర మంలో ఎంపీడీవో శ్రీనివాసులు, వ్యవసాయ అధికారి విష్ణువర్ధనరెడ్డి, ఉద్యాన అధికారి నరేష్‌ కుమార్‌రెడ్డి, పశువైద్యాధికారి డా.శ్రీకాంతరెడ్డి, ఉలిందకొండ సింగిల్‌విండో చైర్మన ఈవీ రమణ, వాకిటి మాదేష్‌, రా మాంజనేయులు, లక్ష్మన్న, మునిస్వామి, టి.వినోద్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 01 , 2026 | 12:20 AM