Share News

ఉల్లి రైతులకు అండగా ప్రభుత్వం

ABN , Publish Date - Jan 02 , 2026 | 11:31 PM

రాష్ట్రంలోనే ఉల్లి పంట సాగులో కర్నూలు జిల్లా రైతులు మొదటి స్థానంలో ఉన్నారు. ఏటా ప్రకృతి వైపరీత్యాలు, ధర తగ్గిపోయి నష్టాలపాలవుతున్నారు. వారిని ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ఉల్లి రైతులకు అండగా ప్రభుత్వం

నేడు కోడుమూరుకు మంత్రి అచ్చెన్నాయుడు రాక

నష్టపరిహారం రైతుల ఖాతాల్లో జమ

కర్నూలు అగ్రికల్చర్‌/ కోడుమూరు, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోనే ఉల్లి పంట సాగులో కర్నూలు జిల్లా రైతులు మొదటి స్థానంలో ఉన్నారు. ఏటా ప్రకృతి వైపరీత్యాలు, ధర తగ్గిపోయి నష్టాలపాలవుతున్నారు. వారిని ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరావు అచ్చెన్నాయుడు శనివారం కోడుమూరుకు రానున్నారు. ఉల్లి ధరల పతనంతో నష్టపోయిన రైతులను కూటమి ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని ఇది వరకే ప్రభుత్వం నిర్ణయిం చింది. కర్నూలు జిల్లా వ్యాప్తంగా 31,352 మంది రైతులు నష్టపోగా కర్నూలు జిల్లాకే సుమారుగా రూ.100కోట్లు ప్రభుత్వం ఆర్థిక సా యం అందిస్తోంది. ప్రభుత్వం విడుదల చేసిన నిధులను రైతుల అకౌంట్లలో జమ చేసే కార్యక్రమాన్ని మంత్రి అచ్చెన్నాయుడు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ఏ.సిరి, అధికారులు, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, మరికొంత మంది ఎమ్మెల్యేలు, కేడీసీసీబీ చైర్మన్‌ డి.విష్ణువర్థన్‌రెడ్డి పాల్గొననున్నారు. ఉదయం 11గంటలకు మంత్రి కోడుమూరులోని జీవీఆర్‌ జడ్పీ హైస్కూల్‌ మైదానంకు చేరుకొంటారు. ఉదయం 11గంటల నుంచి 11.40 నిమిషాల వరకు డిపార్ట్‌మెంటు ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను తిలకిస్తారు. 12 గంటలకు జ్యోతి ప్రజ్వలన చేస్తారు. 12 గంటల నుంచి 1గంట వరకు కలెక్టర్‌, ఎమ్మెల్యే, పలువురి నాయకులు, మంత్రి రైతులనుద్దేశించి మాట్లాడుతారని అధికారులు తెలిపారు. ఉల్లిసాగులో రెండో స్థానంలో ఉన్న కడప జిల్లాలో రూ.37,752 మంది రైతులకు రూ.128.33 కోట్లు అందించేందుకు మంత్రి అచ్చెన్నాయుడు ఆ రైతుల బ్యాంకు ఖాతాలకు కోడుమూరు సభలోనే జమ చేస్తారు.

రైతులకు ప్రభుత్వం అండగా ఉంది

కూటమి ప్రభుత్వం ఉల్లి రైతులకు ప్రభుత్వం అండగా ఉంది. వారిని ఆదుకునేందుకు చర్యలు చేపట్టింది. నవంబరు నెలలో సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ నుంచి ఐఏఎస్‌ అధికారులను కర్నూలు జిల్లా రైతులను ఏ విదంగా ఆదుకోవాలో భవిష్యత్తులో వారి కష్టాలను తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక టీమ్‌ ద్వారా సర్వే చేయించింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఉన్నతాధికారులు కర్నూలు మార్కెట్‌ యార్డులో ఉల్లి రైతులను విచారించారు. కోడుమూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో పర్యటించి అక్కడి రైతుల పరిస్థితులను తెలుసుకున్నారు.

రాజా కృష్ణారెడ్డి, ఉద్యాన శాఖ జిల్లా అధికారి, కర్నూలు

Updated Date - Jan 02 , 2026 | 11:31 PM