అన్నదాతలకు అండగా ప్రభుత్వం
ABN , Publish Date - Mar 13 , 2026 | 11:29 PM
రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తోందని కలెక్టర్ డా.ఏ.సిరి అన్నారు.
కలెక్టర్ డా.ఏ. సిరి
‘అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్’ నిధులు విడుదల
కర్నూలు అగ్రికల్చర్, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తోందని కలెక్టర్ డా.ఏ.సిరి అన్నారు. శుక్రవారం జోహరాపురంలోని సచివాలయంలో ‘అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్’ నిధుల విడదల కార్యక్రమంలో జేసీ నూరుల్ ఖమర్‌తో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన 2,72,757 మంది రైతులకు రూ.154.94 కోట్లు లబ్ధి చేకూరిందన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు ప్రణాళికను రూపొందించామన్నారు. వర్షాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో పశువుల మేత కోసం పీఎండీఎస్ పద్ధతిలో గ్రాసాన్ని పెంచేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. రైతులకు మంచి ధర వచ్చే పంటల గురించి అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు కలెక్టర్ వివరించారు. వ్యవసాయ శాఖ జేడీ రాజశేఖర్, అధికారులు పాల్గొన్నారు.