రైతులకు అండగా ప్రభుత్వం
ABN , Publish Date - Jan 20 , 2026 | 12:46 AM
రాష్ట్రంలో పశు రైతుల సమస్యలను పరిష్కరిస్తూ వారికి కొండంత అండగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని టీడీపీ మంత్రాలయం ఇనచార్జి రాఘవేంద్ర రెడ్డి అన్నారు.
టీడీపీ మంత్రాలయం ఇనచార్జి రాఘవేంద్రరెడ్డి
మంత్రాలయం, జనవరి 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పశు రైతుల సమస్యలను పరిష్కరిస్తూ వారికి కొండంత అండగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని టీడీపీ మంత్రాలయం ఇనచార్జి రాఘవేంద్ర రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని మాధవరం గ్రామం లో రాఘవేంద్రరెడ్డి, పశువైద్య అసిస్టెంట్ డైరెక్టర్లు వెంకట సుబ్బయ్య, రాములు నాయక్, మండల పశువైద్య అధికారి సంతోష్ 1962 ఉచిత పశు అంబులెన్స సేవలను జెండా ఊపి ప్రారంభించారు. రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ మండలంలో 10,338 ఆవులు, గేదెలు 36,904 గొర్రెలు, 44,933 కోళ్లు ఉన్నాయని అన్నారు. పశువులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. రైతులు ఉచిత పశు అంబులెన్సను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అంబులెన్స వైద్యులు సుమ, జయలక్ష్మి, నిజాం, బారికి ఉరుకుందు, బూదిరెడ్డి, గూర్మింటి భీమిరెడ్డి, నాగరాజు, మడివాల రాఘవేంద్ర పాల్గొన్నారు.