ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు
ABN , Publish Date - May 16 , 2026 | 12:15 AM
వన్‌మంత్ ఫోర్ విజిట్‌తో ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలను తీసుకెళ్తున్నట్లు కలెక్టర్ రాజకుమారి, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు.
కలెక్టర్ రాజకుమారి, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
ఆళ్లగడ్డ, మే 15 (ఆంధ్రజ్యోతి): వన్‌మంత్ ఫోర్ విజిట్‌తో ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలను తీసుకెళ్తున్నట్లు కలెక్టర్ రాజకుమారి, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. శుక్రవారం ఆళ్లగడ్డ పట్టణంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్‌లో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. కలెక్టర్ రాజకుమారి ముఖ్యఅతిథిగా హాజరు కాగా ఎమ్మెల్యే పుష్పగుచ్ఛం ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందరంగా నియోజకవర్గం లోని ఆరు మండలాల నుంచి 458 అర్జీలను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి దూర ప్రాంతాల ప్రజలు రావడానికి ఇబ్బందులు పడుతున్నారని, ప్రజలకు చేరువలో సేవులు అందించేందుకు ఇకపై ప్రతి నియోజక వర్గంలో శుక్రవారం ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి ఒక రోజు నుంచి 21 రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ గతంలో చిన్న చిన్న పనుల కోసం ప్రజలు అధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, ప్రస్తుతం అధికారులే ప్రజల వద్దకు వచ్చి సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమిని అన్నారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా అధికారులు స్వేఛ్చగా పనులు చేసే వాతావరణాన్ని ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు.