ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందాలి
ABN , Publish Date - Apr 21 , 2026 | 12:38 AM
ప్రభుత్వ సంక్షేమ పథకా లు అర్హులందరికీ అందాలని టీడీపీ నగర అధ్యక్షుడు రవికుమార్ చౌదరి అన్నారు.
టీడీపీ నగర అధ్యక్షుడు రవికుమార్ చౌదరి
కర్నూలు, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సంక్షేమ పథకా లు అర్హులందరికీ అందాలని టీడీపీ నగర అధ్యక్షుడు రవికుమార్ చౌదరి అన్నారు. మన నగరం - మన బాధ్యత కార్యక్రమంలో భాగం గా హజ్ కమిటీ డైరెక్టర్ మన్సూర్ అలీఖానతో కలసి సోమవారం 42వ వార్డులోని అశోక్‌నగర్, లేబర్ కాలనీ, వెంకటరమణ కాలనీలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరించారు. కాలనీలో నెలకొన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను మంత్రి టీజీ భరత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పా రు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సుంకన్న, టీడీపీ నాయకులు రాజశేఖర్‌రెడ్డి, తిమ్మరెడ్డి, వలి, బూత ఇనచార్జిలు పాల్గొన్నారు.