దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట
ABN , Publish Date - Jul 13 , 2026 | 11:42 PM
దివ్యాంగుల సంక్షేమా నికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు.
మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్
నంద్యాల రూరల్, జూలై 13 (ఆంధ్రజ్యోతి): దివ్యాంగుల సంక్షేమా నికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో అర్హులైన దివ్యాంగులకు సోమవారం త్రీ వీలర్ మోటార్ వాహనాలను పంపిణీ చేశారు. అనంతరం దివ్యాంగులతో కలిపి వాహనంపై ప్రయాణించారు. మంత్రి మాట్లాడుతూ దివ్యాంగుల ఆర్థికాభివృద్ధికి రుణాలు, పలు పథకాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.