ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఫలాలు : మంత్రి ఫరూక్
ABN , Publish Date - Aug 01 , 2026 | 12:33 AM
knl news
నంద్యాల రూరల్, జూలై 31 (ఆంధ్రజ్యోతి) : ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఫలాలు అందాలని, ప్రతి కార్యకర్త ప్రజలతో మమేకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని చాపిరేవుల గ్రామంలో నిర్వహించిన ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రతి కుటుంబానికి సంక్షేమం, ప్రతి ప్రాంతంలో అభివృద్ధి అనే లక్ష్యంతో ముందుకు సాగుతోందన్నారు. ప్రజలకు ఏకష్టం, నష్టం వచ్చిన వాటి పరిష్కారం కోసం ఎల్లవేలలా ప్రభుత్వం అందుబాటులో ఉంటుందన్నారు కార్యక్రమంలో నంద్యాల మార్కెట్ యార్డు చైర్మెన్ గుంటుపల్లి హరిబాబు, భూపాల్‌రెడ్డి, వెంటక సుబ్బారెడ్డి, శేఖర్‌రెడ్డి, పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం అర్హులందరినీ గుర్తించి సంక్షేమ పథకాలు అందిస్తున్నదని అయ్యలూరు టీడీపీ నాయకురాలు బైరెడ్డి శంకరమ్మ తెలిపారు. శుక్రవారం మండలంలోని అయ్యలూరులో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. గత ప్రభుత్వం ప్రజల మధ్య భేదాభిప్రాయాలతో అల్లర్లు సృషించిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు.