Share News

ప్రభుత్వ ఆస్తులను ప్రజా ప్రయోజనాలకే వినియోగించాలి

ABN , Publish Date - Jul 26 , 2026 | 12:42 AM

ప్రభుత్వ ఆస్తులను ప్రజా ప్రయోజనాలకు మాత్రమే వినియోగించాలని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి పేర్కొన్నారు.

ప్రభుత్వ ఆస్తులను ప్రజా ప్రయోజనాలకే వినియోగించాలి
మాట్లాడుతున్నశిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి

నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి

నంద్యాల రూరల్‌, జూలై 25 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ ఆస్తులను ప్రజా ప్రయోజనాలకు మాత్రమే వినియోగించాలని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం టెక్కె మార్కెట్‌ యార్డు సమీపంలో మార్కెట్‌ యార్డు స్థలంలో టీడీపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం పట్ల అఖిలపక్ష ఐక్య వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన సత్యాగ్రహ దీక్షకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూనెపల్లిలో రైతుల కోసం కేటాయించిన మార్కెట్‌ యార్డు స్థలంలో టీడీపీ కార్యాలయ నిర్మాణాన్ని చేపట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఎకరాకు నెలకు రూ.83 చొప్పున 33 ఏళ్లకు రెండు ఎకరాలు లీజుకు ఇవ్వడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ స్థలాలను పార్టీలకు కట్టబెడితే ఊరుకోమని హెచ్చరించారు. న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. కాగా దస్తావేజు లేఖర్ల జీవనోపాధిని దెబ్బతిసే జీవో నం.396ను రద్దు చేయాలని శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయం ఎదుట నిరసన చేపడుతున్న దస్తావేజు లేఖర్లకు సంఘీభావం తెలిపారు. దస్తావేజు లేఖర్ల డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.

Updated Date - Jul 26 , 2026 | 12:42 AM