పేదలకు అండగా ప్రభుత్వం
ABN , Publish Date - Mar 08 , 2026 | 12:21 AM
నిరుపేదప్రజల ఆరోగ్యానికి టీడీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీజనార్దన్‌రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో వైద్య చికిత్సలు చేయించుకున్న 71 మంది లబ్ధిదారులకు రూ.50.59లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.
రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
బనగానపల్లె, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): నిరుపేదప్రజల ఆరోగ్యానికి టీడీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీజనార్దన్‌రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో వైద్య చికిత్సలు చేయించుకున్న 71 మంది లబ్ధిదారులకు రూ.50.59లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో నిరుపేదల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల వెన్నంటే ఉంటుందన్నారు. కుటుంబ పెద్ద అనారోగ్యం పాలయితే ఆ కుటుంబం అప్పులల్లో చిక్కుకోకుండా సీఎం సహాయనిధి తోడుగా ఉంటుందన్నారు. అనంతరం రోగుల ఆరోగ్య పరిస్థితి, వారి యోగ క్షేమాలను మంత్రి స్వయంగా అడిగి తెలుసుకున్నారు.