కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
ABN , Publish Date - Jul 25 , 2026 | 12:14 AM
టీడీపీ ప్రభుత్వ పాలనలో విద్యాశాఖ మంత్రి లోకేశ్ సారథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం పట్టణంలోని జడ్పీ బాలికల ఉన్నతపాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ల సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి బీసీతో పాటు ఆర్డీవో నరేంద్రనాథరెడ్డి పాల్గొన్నారు.
మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
బనగానపల్లె జడ్పీ బాలికల పాఠశాలలో పాల్గొన్న మంత్రి
నియోజకవర్గాల్లో మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్
బనగానపల్లె, జూలై 24 (ఆంధ్రజ్యోతి): టీడీపీ ప్రభుత్వ పాలనలో విద్యాశాఖ మంత్రి లోకేశ్ సారథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం పట్టణంలోని జడ్పీ బాలికల ఉన్నతపాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ల సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి బీసీతో పాటు ఆర్డీవో నరేంద్రనాథరెడ్డి పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నేతృత్వంలో విద్యలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయన్నారు. గత వైసీపీ ప్రభుత్వం విద్యాశాఖను భ్రష్టుపట్టించడంతో లోకేశ్ పట్టుబట్టి విద్యాశాఖను తీసుకుని ప్రభుత్వ పాఠశాలలను గాడిలో పెట్టారన్నారు. రాష్ట్రంలో 67.47 లక్షల మంది విద్యార్థులకు 10,120 కోట్లు తల్లికివందనం జమచేశామన్నారు. బనగానపల్లె నియోజకవర్గంలో 43,987 మంది విద్యార్థులకు రూ.57,18 కోట్లు జమ చేశామని, అంగన్‌వాడీల పిల్లలకు కూడా అందాయన్నారు. 36 లక్షల మంది విద్యార్థులకు కిట్లు పంపిణీ చేశామన్నారు. ఏపీ సైన్స్ సిటీ, ఆర్‌ఆండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో 26 జిల్లాలనుంచి 52 మంది విద్యార్థులను తొలిసారి ప్లైట్‌లో ఢిల్లీకి తీసుకు వెళ్లామని, మెగా డీఎస్పీ ద్వారా 16,347 మంది పోస్టులు భర్తీచేశామన్నారు. పరీక్షల్లో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు షైనింగ్‌స్టార్ బహుమతులు ఇస్తున్నామన్నారు. తన సొంత నిధులు రూ.8లక్షలతో ఆటస్థలం ఏర్పాటు చేశామన్నారు. విద్యాకమిటీ చైర్మన్ ముంతాజ్‌బేగం, ఎంఈవో స్వరూప, హెచ్‌ఎం ప్రసాదరావు, పేరెంట్ కమిటీ చైర్మన్ పర్వీనాభాను, ఈవో మురళీమోహన్, అబ్దుల్‌కలాం, అల్తా్‌పహుసేన్, అహమ్మహుసేన్, పత్తి మహబూబ్‌బాషా, గుండం మల్లిఖార్జునరెడ్డి, నియాజ్, బొబ్బల మహేశ్వరరెడ్డి, గౌండాబాబు పాల్గొన్నారు. అనంతరం అదనపు తరగతి గదులను మంత్రి ప్రారంభించారు. నాలుగు నెలల్లో రూ.32 లక్షలతో 14 టాయ్‌లెట్లు నిర్మిస్తామన్నారు. డీఈ నాగశ్రీనివాసులు పాల్గొన్నారు.
విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయులతోపాటు తల్లిదండ్రులు భాగసామ్యం కావాలని టీడీపీ నాయకురాలు బీసి ఇందిరమ్మ కోరారు. పట్టణంలోని తెలుగుపేట ప్రాథమిక పాఠశాలలో మెగా పీటీఎంకు ఆమె హాజరయ్యారు. ప్రభుత్వం కుటుంబంలోని చదివే పిల్లలందరికీ తల్లికివందనం జమ చేసిందని, కష్టపడి చదివి ఉన్నతస్థాయికి చేరాలన్నారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు టంగుటూరు శ్రీనయ్య, హెచ్‌ఎం ప్రతాప్, టీచర్ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
బేతంచెర్ల: విద్యార్ధులను తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై బాధ్యత ఉందని డోన్ ఎమ్మెల్యే కోట్ల పేర్కొన్నారు. శుక్రవారం గోరుమానుకొండ ఎంజేపీ బీసీ బాలుర గురుకుల పాఠశాల, మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలలో పీటీఎంలో పాల్గొన్నారు. ప్రిన్సిపాళ్లు రామ్మోహన్, మరియదాసు, పత్యేక అధికారి ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ శ్రీధర్ రెడ్డి, ఎంపీడీవో ఫజిల్ రెహ్మాన్, కన్వీనరుఉ్ల ఎల్లనాగయ్య, బుగ్గన ప్రసన్నలక్ష్మి, బుగ్గన ప్రభాకర్ రెడ్డి, జాకీరుల్లా బేగ్ పాల్గొన్నారు.
శిరివెళ్ల: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. మోడల్‌స్కూల్‌లో నిర్వహించిన మెగా పీటీఎం కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సెల్‌ఫోన్ ఎంత ఉపయోగకరమో అంతే ప్రమాదకరమని వాటికి దూరంగా విద్యార్థులకు సూచించారు. 37,860మంది విద్యార్థులకు గాను రూ.45.79 కోట్లు ప్రభుత్వం జమ చేసిందన్నారు. కన్వీనర్ కాటంరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ యామా గుర్రప్ప, సూరా రామ, బీసీ ఫదాహుసేన్, డిప్యూటీ ఈవో శంకరప్రసాద్, ప్రిన్సిపాల్ ఇష్రత్‌భేగం, తహసీల్దార్ విజయశ్రీ, ఎంపీడీవో శివమల్లేశ్వరప్ప పాల్గొన్నారు.
ఆళ్లగడ్డ: వైపీఎం పాఠశాలలో మోగా పేరెంట్ మీట్‌కు ఎమ్మెల్యే హాజరయ్యారు. విద్యార్థులు చెప్పిన వృత్తులను ప్రొజెక్టర్ ద్వారా చిత్రాలతో చూపిస్తూ వారికి ప్రేరణ కలిగించారు.