Share News

ప్రభుత్వం ఉదాసీన వైఖరి

ABN , Publish Date - Aug 30 , 2026 | 12:20 AM

కర్నూలులో హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలంటూ న్యాయవాదులు చేస్తున్న ఆందోళనలను ప్రభుత్వం ఉదాసీన వైఖరితో చేస్తుందని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చంద్రుడు అన్నారు. శనివారం కోర్టు విధులను బహిష్కరించిన న్యాయవాదులు జిల్లా కోర్టు ఎదురుగా ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు.

ప్రభుత్వం ఉదాసీన వైఖరి
మాట్లాడుతున్న చంద్రుడు

బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చంద్రుడు

కొనసాగుతున్న న్యాయవాదుల దీక్షలు

కర్నూలు లీగల్‌, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): కర్నూలులో హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలంటూ న్యాయవాదులు చేస్తున్న ఆందోళనలను ప్రభుత్వం ఉదాసీన వైఖరితో చేస్తుందని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చంద్రుడు అన్నారు. శనివారం కోర్టు విధులను బహిష్కరించిన న్యాయవాదులు జిల్లా కోర్టు ఎదురుగా ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. ఆయన మాట్లాడుతూ తమ కోర్టు విధుల బహిష్కరణ కార్యక్రమం సెప్టెంబరు 3వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు. కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు పై ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వచ్చే వరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామన్నారు. బార్‌ అసోసియేషన్‌ మాజీ ప్రధాన కార్యదర్శి రవి కాంత్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ రాయలసీమ వాసులకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుందని కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్‌ను ఏర్పాటు చేస్తేనే రాయలసీమకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ దీక్షల్లో పాల్గొన్న వారిలో న్యాయవాదులు మామిళ్ల విక్టర్‌ కృష్ణప్రసాద్‌, శ్రీనివాసులు గౌడు, ఏ.శ్రీనివాసులు, రాము, ఎండీ మహేష్‌ కుమార్‌ ఉన్నారు. ఈ శిబిరానికి వివిధ పార్టీల, ప్రజా సంఘాల నాయకులు సందర్శించి తమ సంఘీభావాన్ని తెలిపారు.

Updated Date - Aug 30 , 2026 | 12:21 AM