తాటిముంజలతో మేలు
ABN , Publish Date - Apr 05 , 2026 | 12:09 AM
తాటిముంజలను ఐస్ ఆపిల్‌గా పిలుస్తారు. వేసవిలో సహజసిద్ధంగా ఇవి లభిస్తాయి. వీటితో ఇటు ఆరోగ్యం, అటు చల్లదంన వస్తుందని వైద్యులు తెలిపారు. శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉండటమే కాకుండా డీహైడ్రేషన్‌ను తగ్గింస్తాయని, మధుమేహ నియంత్రణ , జీర్ణక్రియ మెరుగుదల, చర్మఆరోగ్యానికి ఇవి మేలు చేస్తాయి.
చల్లదనంతోపాటు పోషక విలువలు ఉన్నాయంటున్న వైద్యులు
రుద్రవరం, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): తాటిముంజలను ఐస్ ఆపిల్‌గా పిలుస్తారు. వేసవిలో సహజసిద్ధంగా ఇవి లభిస్తాయి. వీటితో ఇటు ఆరోగ్యం, అటు చల్లదంన వస్తుందని వైద్యులు తెలిపారు. శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉండటమే కాకుండా డీహైడ్రేషన్‌ను తగ్గింస్తాయని, మధుమేహ నియంత్రణ , జీర్ణక్రియ మెరుగుదల, చర్మఆరోగ్యానికి ఇవి మేలు చేస్తాయి.
పోషకాలు ఇలా
తాటిముంజల్లో విటమిన్ ఏ, సీ, బీ7, ఈ, పొటాషియంయ ఫాస్పరస్, క్యాల్షియం, ఐరన్‌వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
మధుమేహానికి ప్రయోజనం
మధుమేహ రోగులకు తాటిముంజలు ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలో తక్కువ గ్లెసెమిమిక్ సూచిక ఉంటంతో చక్కెరను నియంత్రిస్తుంది. చర్మ సౌందర్యం, తాటిముంజల గుజ్జును ముఖానికి పైపూతలా వేసుకుంటే చర్మం ప్రకాశంంతంగా ఉంటుంది. చర్మానికి కావాలసినంత తేమను అందిస్తుంది. వేసవిలో చెమటకాయలను నివారిస్తుంది. ముఖంపై ఏర్పడే మచ్చలను దూరం చేస్తుంది. అలాగే జీర్ణక్రియకు ఇవి సహకరిస్తాయి. ఆహారం సరిగి జీర్ణం కాకుంటే బరువు పెరిగే అవకాశం ఉంది. తాటి ముంజలతో దీన్ని నియంత్రించవచ్చు. లివర్ సమస్య తగ్గించుకోవచ్చు. వికారం, వాంతులునివారిస్తాయి. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గించవచ్చు. అలాగే గర్భధారణ సమయంలో ఇవి తీసుకుంటే మేలని వైద్యులు అంటున్నారు.