Share News

పల్లె దారికి మహర్దశ..

ABN , Publish Date - Aug 18 , 2026 | 12:20 AM

మండలంలో సీసీ రోడ్ల నిర్మాణంతో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఎమ్మెల్యే కోట్ల చొరవతో సీసీ రోడ్లు నిర్మించడంతో కాలనీలు కళకళలాడుతున్నాయి

పల్లె దారికి మహర్దశ..
వెంకటనాయునిపల్లె గ్రామం కొత్త బిల్డింగుల్లో నిర్మించిన రోడ్డు

డోన్‌ మండంలోని గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం

డోన్‌ రూరల్‌, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): మండలంలో సీసీ రోడ్ల నిర్మాణంతో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఎమ్మెల్యే కోట్ల చొరవతో సీసీ రోడ్లు నిర్మించడంతో కాలనీలు కళకళలాడుతున్నాయి. 2024-25లో రూ.3 కోట్లతో రామదుర్గం, కమలాపురం, చిన్నమల్కాపురం, కోట్రాయి, తిరునాంపల్లి, కొచ్చెర్వు, వెంకటనాయునిపల్లె, ఉడుములపాడు, గుమ్మకొండ, బొంతిరాళ్ల గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మించినట్లు అధికారులు తెలిపారు. 2025-26లో రూ.3.50కోట్లతో చనుగొండ్ల, కొత్తబురుజు, కొత్తకోట, మిద్దెపల్లి, అనుంపల్లి, ఎద్దుపెంట, యాపదిన్నె, ఓబులాపురం, ఉంగరానిగుండ్ల, కొత్తపల్లె, మల్లెంపల్లె, వలసల, తాటిమాన్‌కొత్తూరు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తిచేసినట్లు అధికారులు తెలుపుతున్నారు.

గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం

రెండేళ్లలో గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మిం చాం. రూ.6.5కోట్లతో రహదారులను పూర్తి చేశాం. - నారాయణ, పీఆర్‌ఏఈ.

Updated Date - Aug 18 , 2026 | 12:20 AM