‘బాలల మేధోవికాసానికి మంచి కథల పుస్తకాలు అవసరం’
ABN , Publish Date - May 25 , 2026 | 12:38 AM
బాలల మేధోవికాసానికి మంచి కథల పుస్తకాలు అవసరమని జిల్లా గ్రంథాలయ సంస్థ ఉప కార్యదర్శి వి.పెద్దక్క అన్నారు.
కర్నూలు కల్చరల్, మే 24(ఆంధ్రజ్యోతి): బాలల మేధోవికాసానికి మంచి కథల పుస్తకాలు అవసరమని జిల్లా గ్రంథాలయ సంస్థ ఉప కార్యదర్శి వి.పెద్దక్క అన్నారు. నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో కర్నూలుకు చెందిన ప్రముఖ బాలసాహిత్యవేత్త డాక్టర్ ఎం. హరికిషన రాసిన ‘బంగారు మనసు’ పుస్తకావిష్కరణ జరిగింది. ప్రజా గాయకుడు ఎంపీ బసవరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వి. పెద్దక్క పుస్త కాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. విద్యార్థులు కథల పుస్తకాలు చదవడం వల్ల వారిలో జిజ్ఞాసతోపాటూ ఊహా కల్పన, యోచించే గుణం, ఆలోచనా సరళి పెంపొందుతాయని చెప్పారు. పుస్తక రచయిత డాక్టర్ ఎం. హరికిషన మాట్లాడుతూ విద్యార్థులకు సరళంగా, చిన్న పదాలతో రాసే కథలు ఎంతో ఆకట్టుకుంటాయని, ఆ దిశగా ఈ పుస్త కం విద్యార్థులను చదివిస్తుందని చె ప్పారు. కార్యక్రమంలో రచయితలు గనుమాల మునిస్వామి, పుల్లా రామాం జినేయులు, విజయులు, మా దాల శ్రీనివాసులు, కోలుకొండ వీర నాగేశ్వ రయ్య, రేవుల శ్రీనివాసులు, సి.యాగంటీశ్వరప్పలు పుస్తకంపై సమీక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆలపించిన దేశభక్తి గీతాలు ఆకట్టుకున్నాయి.