పేద ప్రజలకు మెరుగైన 108 సేవలు
ABN , Publish Date - Jan 07 , 2026 | 12:15 AM
రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రనజలకు 108 ద్వారా మెరుగైన సేవలందిస్తోందని, వైసీపీ నాయకుల ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయని నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి మండిపడ్డారు.
108పై వైసీపీ ఆరోపణలు హాస్యాస్పదం
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత
కల్లూరు, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రనజలకు 108 ద్వారా మెరుగైన సేవలందిస్తోందని, వైసీపీ నాయకుల ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయని నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి మండిపడ్డారు. మంగళవారం సి.క్యాంపు 108 కార్యాలయం ముందు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. అనంతరం 108 పాత వాహనాలను పరిశీలించారు. గత వైసీపీ ప్రభుత్వంలో పాడుబడ్డ వాహనాల ఫోటోలు తీసి పత్రికలో అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం అత్యవసర వైద్య చికిత్సలకు గోల్డెన్ అవర్ పట్టణాల్లో 18 నిమిషాలు, గ్రామీణ ప్రాంతాల్లో 23 నిమిషాలకు చేరుకుని చికిత్స అందించేలా చర్యలు తీసుకుందన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో 108 సర్వీసులు ఉన్నాయని ఆదనంగా మరో రెండు సర్వీసులు పనిచేస్తున్నాయన్నారు. పేదలకు రూ.25 లక్షల వైద్యం, ప్రతి ఒక్కరికీ రూ.2.5 లక్షల వరకు ఉచిత వైధ్యం ప్రభుత్వం అందిస్తుందన్నారు. సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.కోట్లలను బాధితులకు ఇస్తున్మాని ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగుతున్నాయన్నారు. అభివృద్ది, సంక్షేమ పథకాలను, పరిశ్రమలు, పెట్టుబడులు రావడం చూసి ఓర్వలేక వైసీపీ దుష్ప్రచారాలు చేస్తోందన్నారు. ఎడ్యుకేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ డైరెక్టర్ జి.నాగముని, నాగేశ్వరరెడ్డి, సుధాకర్‌రెడ్డి, పుల్లయ్యగౌడ్, జనసేన నాయకుడు తిరుమలేష్ పాల్గొన్నారు.