Share News

హ్యాండ్‌ బుక్‌తో సత్ఫలితాలు

ABN , Publish Date - Oct 27 , 2026 | 12:41 AM

ప్రభుత్వం పాఠశాల విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందుకు టీచర్లకు హ్యాండ్‌బుక్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సులభంగా విద్యాలక్ష్యాలు సాధించేలా విద్యార్థుల్లో అవగాహన కలిగించేందుకు ఈ టీచర్స్‌ హ్యాండ్‌బుక్‌ చక్కగా ఉపయోగపడుతుందని విద్యాశాఖ అధికారులు అంటున్నారు.

హ్యాండ్‌ బుక్‌తో సత్ఫలితాలు
హ్యాండ్‌ బుక్‌తో బోధిస్తున్న ఉపాధ్యాయురాలు

బోధనలో వినూత్న మార్పులు

విద్యాలక్ష్యాల సాధనకు ఉపయుక్తం

చాగలమర్రి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం పాఠశాల విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందుకు టీచర్లకు హ్యాండ్‌బుక్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సులభంగా విద్యాలక్ష్యాలు సాధించేలా విద్యార్థుల్లో అవగాహన కలిగించేందుకు ఈ టీచర్స్‌ హ్యాండ్‌బుక్‌ చక్కగా ఉపయోగపడుతుందని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. ఎస్‌ఈఆర్టీ సహకారంతో సమగ్రశిక్ష అభియాన్‌ ద్వారా విద్యా వనరులను అందించేందుకు వీలుగా హ్యాండ్‌బుక్కును తీర్చిదిద్ధినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. సబ్జెక్టులవారీగా 1 నుంచి పదో తరగతి వరకు హ్యాండ్‌బుక్కులను ప్రభుత్వం పంపిణీ చేసింది. విద్యాసంవత్సరం ఆధారంగా సమగ్రశిక్ష అభియాన్‌ విద్యాక్యాలెండర్‌ తయారు చేసి ,ఎప్పుడు ఏ పాఠం బోధించాలో అందులో వివరించారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఒకే పాఠాన్ని బోధించేలా క్యాలెండర్‌ను తయారు చేశారు. తాము బోధించే పాఠ్యాంశాన్ని ముందుగా ఇతర ఉపాధ్యాయులతో చర్చించే అవకాశం ఉన్నట్లు పలువురు ఉపాధ్యాయులు తెలిపారు.

విద్యావ్యవస్థను గాడిలో పెట్టేందుకు..

జిల్లాలో సుమారు 365 ఉన్నత పాఠశాలల్లో 99,949 మంది విద్యార్థులు, 1,020 ప్రాథమిక పాఠశాలల్లో 47,246 మంది విద్యార్థులు, 27 యూపీ పాఠశాలల్లో 1,779 మంది విద్యార్థులు చదువుతున్నారు. మొత్తం 1,48,774 మంది విద్యార్థులు ఉన్నారు. 7,619 మంది ఉపాధ్యాయులు బోదన చేస్తున్నారు. వైసీపీ పాలనలో దెబ్బతిన్న విద్యావ్యవస్థను గాడిలో పెట్టేందుకు విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ మార్పుకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా తల్లికి వందనం, మోడల్‌ ప్రైమరీ పాఠశాలలు, ఉపాధ్యాయులకు బోదన కరదీపికలు(హ్యాండ్‌బుక్‌) అందించారు. విద్యార్థులకు అసే్‌సమెంట్‌ బుక్కులను పంపిణీ చేశారు.

జిల్లాలో పాఠశాలల వివరాలు

జడ్పీ ఉన్నత పాఠశాలలు : 365

ప్రాథమికోన్నత పాఠశాలలు: 27

ప్రాథమిక పాఠశాలలు : 1,020

హ్యాండ్‌బుక్‌తో ఎంతో ఉపయోగం

ఉపాధ్యాయులకు హ్యాండ్‌బుక్‌ ఎంతో ఉపయోగపడుతుంది. విద్యా లక్ష్యాలను సాధించేందుకు, విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించేందుకు ఇందులో పొందుపరచి ఉన్నారు. దీని వల్ల విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. హ్యాండ్‌బుక్కు ఆధారంగా ఉపాధ్యాయులు చక్కగా బోధిస్తున్నారు. - శివలక్ష్మి, హెచ్‌ఎం, పీఎంశ్రీ పాఠశాల, చాగలమర్రి

Updated Date - Oct 27 , 2026 | 12:41 AM