వరించిన ధర..
ABN , Publish Date - Nov 12 , 2026 | 11:46 PM
ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక కేసీకెనాల్, తెలుగుగంగ చెరువుల కింద వరి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ఖరీ్‌ఫలో జిల్లాలో వరి సాధారణ సాగు ఆరు వేల హెక్టార్లు కాగా, ఈ ఏడాది 3,500 హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. చాగలమర్రి, ఆళ్లగడ్డ, రుద్రవరం, సిరివెళ్ల మండలాల్లో కూడా బోర్ల కింద వరి పంటను సాగు చేశారని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
వరి క్వింటా రూ.3వేలు..
హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
ఎల్‌నినోతో తగ్గిన సాగు..
చాగలమర్రి, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక కేసీకెనాల్, తెలుగుగంగ చెరువుల కింద వరి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ఖరీ్‌ఫలో జిల్లాలో వరి సాధారణ సాగు ఆరు వేల హెక్టార్లు కాగా, ఈ ఏడాది 3,500 హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. చాగలమర్రి, ఆళ్లగడ్డ, రుద్రవరం, సిరివెళ్ల మండలాల్లో కూడా బోర్ల కింద వరి పంటను సాగు చేశారని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
అడపా దడపా వర్షాలు..
ఖరీఫ్ ప్రారంభంలో వర్షాలు కురవక రైతులు ఇబ్బందులు పడ్డారు. చెరువులు, టీజీపీకి నీళ్లు రాకపోయినా రైతులు బోర్లు, వర్షాలపై ఆధారపడి ధైర్యంగా వరి సాగు చేసినఅయితే అక్టోబరులో కురిసిన వర్షాలు రైతులకు కాస్త ఊరటనిచ్చాయి. బోర్ల కింద సాగు చేసిన వరి ఏపుగా పెరిగి పచ్చగా పొట్ట దశలో, మరికొన్ని చోట్ల కోతదశలో ఉంది. ఇప్పటికే కొన్ని చోట్ల వరికోతలు ప్రారంభమయ్యాయి.
తగ్గిన దిగుబడి..
సాధారణంగా వరి దిగుబడి ఎకరాకు 40క్వింటాళ్లకుపైగా వచ్చేది. అయితే ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో 30 క్వింటాళ్లు కూడా వచ్చేలా లేదని రైతులుచెబుతున్నారు.
ధర ఆశాజనకం..
ఈ ఏడాది వరి సాగు విస్తీర్ణం అతి తక్కువగా ఉండటంతో ధరలు పెరగడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం క్వింటం ధర రూ.3 వేలు పలుకుతోంది. గత ఏడాది వరి ధాన్యం రూ.1300 నుంచి రూ.1400 ఉండేదని ఈసారి ధరలు పెరగడంతో నష్టం రాదని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం వరి సాగుచేసిన రైతులకు యాప్ ద్వారా యూరియా ఎకరాకు 3 బస్తాలు అందించినటు ఏవో నేతాజి తెలిపారు. 20 రోజుల్లో పంట కోత సమయానికి ధర క్వింటాకు రూ.4 వేలు పలుకవచ్చని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కాగా రబీలో వరి సాగుచేయవద్దని, ఆరుతడి పంటలు వేసుకోలని వ్యవసాయాధికారి రంగనేతాజీ రైతులకు సూచించారు.
ధర బాగుంది..
నాలుగు ఎకరాల్లో వరి సాగు చేశా ఎకరాకు 30 క్వింటాళ్లకుపైగా దిగుబడి వచ్చేలా ఉంది. గత ఏడాది క్వింటా ధర రూ.1300 పలికింది. ఈ ఏడాది రూ.3 వేలు దాకా ఉండే అవకాశం ఉంది. - లాలూనాయక్,
కేపీ తండా