వర్షం.. హర్షం
ABN , Publish Date - Sep 20 , 2026 | 11:56 PM
మండలంలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. దీంతో ఇన్నాళ్లు వర్షం లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆళ్లగడ్డలో 98.0 మి.మీల వర్షం కురిసింది. అయితే భారీ వర్షం కురవడంతో పాత కందుకూరు గ్రామ ప్రధాన రహదారిలో భారీ వృక్షాలు నేలకూలాయి. పలు గ్రామాల్లో రేకుల షెడ్లు, గుడిసెలు కూలి నష్టం కలిగించింది.
చాగలమర్రి, కొలిమిగుండ్ల, ఆళ్లగడ్డ బనగానపల్లె మండలాల్లో భారీగా..
రైతుల హర్షం
ఆళ్లగడ్డ, సెప్టెంబరు20 (ఆంధ్రజ్యోతి): మండలంలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. దీంతో ఇన్నాళ్లు వర్షం లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆళ్లగడ్డలో 98.0 మి.మీల వర్షం కురిసింది. అయితే భారీ వర్షం కురవడంతో పాత కందుకూరు గ్రామ ప్రధాన రహదారిలో భారీ వృక్షాలు నేలకూలాయి. పలు గ్రామాల్లో రేకుల షెడ్లు, గుడిసెలు కూలి నష్టం కలిగించింది.
చాగలమర్రిలో కుండపోత
చాగలమర్రి: మండలంలో ఆదివారం తెల్లవారుజామున కుండపోత వర్షం కురిసింది. 45.మీమీ. వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ అధికారి అబ్దుల్‌సత్తార్ తెలిపారు. పెద్దబోదనం, బ్రాహ్మణపల్లె, కలుగొట్లపల్లె వక్కిలేర్లకు, నగల్లపాడు భవనాశి వాగులు నిండాయి. పసుపు, మొక్కజొన్న, ఉల్లి, మినుము, వరి, కంది, వేరుశనగ, అరటి, బొప్పాయి, మిరప పంటలకు వర్షం ప్రాణం పోసిందని రైతులు తెలిపారు.
2,500 క్యూసెక్కుల నీటి ప్రవాహం
రాజోలి ఆనకట్ట వద్ద కుందూనదిలో 2,500 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆనకట్ట వద్ద కేసీ ప్రధాన కాలువకు 300క్యూసెక్కుల నీటిని విడుదల చేశామన్నారు.
సంజామల: ఉదయం నుంచి గంటన్నర పాటు ఓ మోస్తారు వర్షం కువడంతో రైతులు, పశుపోషకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే వర్షం కురియడంతో వారపు సంతకు వచ్చిన వారు ఇబ్బందులు పడ్డారు.
బనగానపల్లెలో 43.6 మి.మీలు
బనగానపల్లె: మండలంలో 43.6 ఎం.ఎం.వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. ఖరీఫ్ సీజన్‌లో జూన్, జూలై, ఆగస్టు నెలల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. కాగా ఈ వర్షం పటలకు ప్రాణం పోసిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్యాపిలి: మండలంలో 68మీ.మీ. వర్ష పాతం నమోదైంది. ప్యాపిలి, పెద్దపూదిళ్ల, చిన్నపూదిళ్ల, రాచెర్ల, భోంచెర్వుపల్లి, వెంగళాంపల్లి తదితర గ్రామాల్లో వర్షం కురిసింది.
రుద్రవరం: మండలంలో 22.4 ఎంఎం వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. ఈ వర్షం పంటలకు ప్రాణం పోసిందని రైతులు హర్షం వ్యక్తం చేశారు.
ఉయ్యాలవాడ: మండలంలోని శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు 44.5మీ.మీ వర్షం కురిసింది. హరివరం, రూపనగుడి, ఉయ్యాలవాడ, ఆర్.పాంపల్లె, కొండుపల్లె గ్రామాల్లోని పొలాల్లో వర్షపునీరు ప్రవహించింది.మిరప, పత్తి, మొక్కజొన్న, మినుము, కంది తదితర పంటలకు ఊరట లభించింది.
శిరివెళ్ల: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఆరుతడి పంటలకు ఊరటనిస్తున్నాయి. మినుము, మొక్కజొన్న, కంది పంటలు వర్షం కురవడంతో పైర్లు ఊపిరి పోసుకున్నాయి
కూలిన చెట్లు, పడిపోయిన స్తంభాలు
చాగలమర్రి, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): మండలంలో కురిసిన వర్షం కొంత నష్టం చేకూర్చింది. చిన్నబోదనం గ్రామంలో మనోహర్‌రెడ్డి, శ్రీనివాసులు, శివలింగారెడ్డి, ఓబులేసు, వెంకటేశ్వర్ రెడ్డితో పాటు మరో ముగ్గురికి చెందిన రేకుల షెడ్లు కలిపోయాయి. అలాగే ఎస్సీ కాలనీలో యాకోబు అననేఉఉ వ్యక్తికి చెందిన బైక్‌పై వేపచెట్టు విరిగిపడింది. రమణారెడ్డి సాగు చేసిన 30 నిమ్మచెట్లు, కృష్ణారెడ్డికి చెందిన 20 నిమ్మచెట్లు విరిగి పడ్డాయి. పెద్దబోదనం, చిన్నబోదనం, చాగలమర్రి గ్రామాల్లో మొక్కజొన్న నేలవాలింది. సర్వీసు రహదారులపై ఆరబోసిన మొక్కజొన్న ధాన్యం తడిచి దెబ్బతిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నబోదనం గ్రామంలో ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయం వద్దగల 200 ఏళ్ల చరిత్ర కలిగిన వేప చెట్టు విరిగిపడి ఆలయ ప్రాంగణం దెబ్బతినింది. రాంపల్లె, పెద్దబోదనం గ్రామాల్లో కూడా విద్యుత్ తీగలు, స్తంభాలు విరిగిపడ్డాయి. పిడుగు శబ్ధానికి 5 ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయి. విద్యుత్ శాఖకు రూ.10లక్షల నష్టం వాటిల్లినట్లు ఇన్‌చార్జి ఏఈ రమణయ్య అన్నారు.