నిరుద్యోగులకు తీపి కబురు
ABN , Publish Date - Aug 18 , 2026 | 11:53 PM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు చేపట్టింది. విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తోంది. అందులో భాగంగానే ఏటా డీఎస్సీ నిర్వహించి వేలాది ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. విద్యా వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు కూటమి ప్రభుత్వం మరో ముందడుగు వేసి నిరుద్యోగ యువతకు తీపి కబురును అందిం చింది.
పాఠశాలల్లో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకం
ఈ నెల 21 వరకు దరఖాస్తుల స్వీకరణ
శిరివెళ్ల/కొలిమిగుండ్ల, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు చేపట్టింది. విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తోంది. అందులో భాగంగానే ఏటా డీఎస్సీ నిర్వహించి వేలాది ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. విద్యా వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు కూటమి ప్రభుత్వం మరో ముందడుగు వేసి నిరుద్యోగ యువతకు తీపి కబురును అందిం చింది. పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీలో భాగంగా తాత్కాలిక ప్రాతిపదికన అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి ప్రకటన విడుదల చేసింది.
ఉమ్మడి జిల్లాలో ఇలా..
ప్రభుత్వ పాఠశాలల్లో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామక ప్రకటనతో అభ్యర్థులు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించారు. నంద్యాల జిల్లాలో 285 సెకండరీ గ్రేడ్(ఎస్జీటీ) ఉద్యోగాలు, 157 స్కూల్ అసిస్టెంట్(ఎ్‌సఏ) పోస్టులున్నాయి. కర్నూలు జిల్లాలో 707 ఎస్జీటీ, 543 స్కూల్ అసిస్టెంట్ పోస్టులున్నాయి. వీటన్నింటిని తాత్కాలిక ప్రా తిపదికన ఆయా జిల్లాల త్రిసభ్య కమిటీ భర్తీ చేయనున్నారు. అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకం పూర్తైతే ఉమ్మడి జిల్లాలోని పలు ఏకోపాధ్యాయ పాఠశాలల్లో విద్యా ర్థులకు ప్రయోజనం చేకూరనుంది.
దరఖాస్తు విధానం... ఎంపిక ప్రక్రియ
డీఎస్సీ ఉద్యోగాలకు ఉన్న అర్హతలతోనే అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకం జరుగు తుంది. టెట్ అర్హత సాధించిన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యతనిస్తారు. ఆయా మండలాల్లోని విద్యాశాఖ కార్యాలయాల్లో(ఎమ్మార్సీ) లభించే దరఖాస్తును పూర్తిచేసి సంబంధిత ధ్రువపత్రాలను జతచేసి ఈనెల 21వ తేదీలోగా విద్యాశాఖ కార్యాలయా ల్లోనే అందించాలి. అనంతరం ఆ దరఖాస్తులు ఎంఈవో కార్యాలయాల నుంచి ఈ నెల 22న డీఈవో కార్యాలయాలకు చేరతాయి. అక్కడ 23 నుంచి 26వ తేదీ వరకు అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలిస్తారు. కలెక్టర్ చైర్మన్‌గా, డీఈవో కన్వీనర్‌గా, డైట్ కళాశాల ప్రిన్సిపాల్ లేదా డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ మెంబర్‌గా ఉన్న త్రిసభ్య కమిటీ ఈ నెల 27, 28 తేదీల్లో తుది జాబితాను సిద్ధంచేస్తారు.
ప్రతిభ ఆధారంగానే ఎంపిక
ఎంపికైన అభ్యర్థులకు 30, 31వ తేదీల్లో నియామక పత్రాలు అందజేస్తారు. అభ్య ర్థులను ఎంపిక చేసేందుకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. అభ్యర్థుల అకడమిక్(75 శాతం), వృత్తిపరమైన(25శాతం) అంశాల్లోని ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలకు ఎంపి క చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు సెప్టెంబరు 1వ తేదీ నుంచి విధుల్లో చేరాల్సి ఉం టుంది. 2026-27 విద్యా సంవత్సరానికిగాను ఎనిమిది నెలలపాటు తాత్కాలిక విధానంలో ఉద్యోగంలో చేరే సెకండరీ గ్రేడ్ (ఎస్జీటీ) అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లకు రూ.10 వేలు, స్కూల్ అసిస్టెంట్‌లకు(ఎ్‌సఏ) రూ.12 వేలు చొప్పున నెలవారీ గౌరవ వేతనం అందిస్తారు.
నిబంధనల మేరకు నియామకాలు చేపడుతాం
పాఠశాలల్లో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల ఎంపికను పారదర్శకంగా నిర్వహిస్తాం. అభ్యర్థుల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి అకడమిక్, ఫ్రొఫెషనల్ అంశాలను పరిగణలోకి తీసుకుని నిబంధనల మేరకు నియామకాలు చేపడతాం. - జనార్దన్‌రెడ్డి, డీఈవో, నంద్యాల