కర్షకులకు తీపి కబురు
ABN , Publish Date - Nov 12 , 2026 | 11:51 PM
కేంద్ర ప్రభుత్వం కర్షకులకు తీపి కబురు అందించింది. ఎరువుల ధరలను తయారీ కంపెనీలు పెంచకుండా చర్యలు చేపట్టింది. ప్రస్తుత రబీ సీజన్‌లో ఎరువుల సబ్సిడీకి రూ.62,370 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది
ఎరువుల ధరల పెరుగుదలకు కళ్లెం
యూరియా, డీఏపీ ఎరువులకు పాతధరలే వర్తింపు
కర్నూలు అగ్రికల్చర్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం కర్షకులకు తీపి కబురు అందించింది. ఎరువుల ధరలను తయారీ కంపెనీలు పెంచకుండా చర్యలు చేపట్టింది. ప్రస్తుత రబీ సీజన్‌లో ఎరువుల సబ్సిడీకి రూ.62,370 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే యూరియా, డీఏపీ తదితర ఎరువుల ధరలు పెరుగుతాయని అంచనా వేస్తున్న ఎరువుల తయారీ కంపెనీల నిర్ణయాలకు కళ్లెం వేసింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో లక్షన్నర మెట్రిక్ టన్నుల యూరియా, రబీ సీజన్‌లో లక్ష మెట్రిక్ టన్నుల యూరియాను రైతులు ఉపయో గిస్తున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన కేబినెట్ సమా వేశంలో రైతులకు ఎంతో ప్రయోజనాన్ని అందించే ఎరువుల సబ్సిడీని భారీగా పెం చుతూ తీసుకున్న నిర్ణయంపై అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతుంది. ఎన్‌బీఎ్‌స పథకం కింద నైట్రోజన్, ఫాస్పరస్, పోటాష్, సల్ఫర్ ఎరువులతో పాటు డీఏపీకి కేం ద్రం ఏటా ప్రత్యేకంగా సబ్సిడీని అందిస్తూ ధరలు పెరగకుండా చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం డీఏపీ 50కిలోల బస్తా ధరను రూ.1,350 వద్దే కొనసాగిస్తున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ఎరువుల సబ్సిడీకి కేంద్రం రూ.1,70,977కోట్లను కేటా యించింది.
రైతులకు భారీ ఊరట
కేంద్రం తీసుకున్న నిర్ణయంతో రైతులకు భారీ ఊరట కలగనుంది. ప్రస్తుతం రైతు లకు యూరియా తక్కువ ధరకే లభిస్తుంది. రైతులు యూరియా, డీఏపీలపై ఎక్కువగా ఆధారపడకుండా భూమిలో సారాన్ని బట్టి పంటల సాగుకు వినియో గించాలి. - ఆలీఅక్తర్ ఖాన్, ఏడీఏ, కర్నూలు