విభిన్న ప్రతిభావంతులకు పెద్దపీట
ABN , Publish Date - Jan 14 , 2026 | 12:38 AM
రాష్ట్ర ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులకు పెద్దపీట వేసిందని టీడీపీ విభిన్న ప్రతిభావంతుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్లప్ప తెలిపారు. మంగళవారం 66వ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం నిర్వహించచారరు. ముఖ్య అతిథులుగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి, ఎమ్మెల్యే గౌరు చరిత, జేసీ నూరుల్ ఖమర్ పాల్గొన్నారు.
కర్నూలు స్పోర్ట్స్, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులకు పెద్దపీట వేసిందని టీడీపీ విభిన్న ప్రతిభావంతుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్లప్ప తెలిపారు. మంగళవారం 66వ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం నిర్వహించచారరు. ముఖ్య అతిథులుగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి, ఎమ్మెల్యే గౌరు చరిత, జేసీ నూరుల్ ఖమర్ పాల్గొన్నారు. మన రాష్ట్రంలో పింఛన్ రూ.3వేల నుంచి రూ.6వేలకు పెంచారని, డయాలసిస్ బైపాస్ సర్జరీ వారికి రూ.10వేలు, పక్షవాతం మంచానికే పరిమితైతే వారికి రూ.15వేలు ప్రభుత్వం ఇస్తుందన్నారు. ట్రాన్స్‌జెండర్స్ వయోవృద్దుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకుడు సెట్కూరు సీఈవో డా.వేణుగోపాల్, వెలుగు పీడీ రమణారెడ్డి, మెప్మా పీడీ శ్రీనివాస్, విభిన్న పాల్గొన్నారు. అనంతరం విభిన్న ప్రతిభావంతులకు చెక్కును అందజేశారు