సుపరిపాలనను ఇంటింటికీ తెలియజేయాలి
ABN , Publish Date - Jul 28 , 2026 | 12:26 AM
knl news
- ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి
శ్రీశైలం, జూలై 27 (ఆంధ్రజ్యోతి): కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి కూటమి ప్రభుత్వ సుపరిపాలనను ప్రజలకు తెలియజేయాలని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వైసీపీ విధ్వంస పాలన.. ఎన్టీఏ వికాస పాలనకు గల వ్యత్యాసంపై అవగాహన కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధ్ది పొందిన ఆయా కుటుంబాలను సోమవారం స్వయంగా కలిసి వారికి చెక్కులు అందజేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల వివరాలతో రూపొందించిన కర పత్రాలను పంపిణీ చేశారు. సామాజిక పింఛన్లు, తల్లికి వందనం, దీపం- 2, స్త్రీ శక్తి, ఆటో డ్రైవర్లు, మత్స్యకారులకు చేయూత, పేదలకు ఇళ్లు, అన్నదాత సుఖీభవ, వ్యవ సాయ రంగంలో రైతులకు ఆసరాతో పాటు విద్యుత్ చార్టీల తగ్గింపు, ప్రాజెక్టులు రహదారులపై సాధించిన పురోగతి వంటి ప్రధానమైన అంశాలపై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించాలని కూటమి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఘంటామఠం, భీమశంకర మఠం, శ్రీగిరికాలనీ, కొత్తపేటలో మౌలిక వసతుల సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులను నమోదు చేసుకున్నారు. కార్యక్రమంలో శ్రీశైలం ఇన్‌చార్జి యుగంధర్‌రెడ్డి, మండలాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి రమణ, దుర్గాప్రసాద్, చదువుల శ్రీను, ఆంజనేయులు, జూలేనాయక్, బద్రీ నాయక్, సాయి తదితరులు పాల్గొన్నారు.