సాంకేతికతతో అధిక దిగుబడులు
ABN , Publish Date - Mar 06 , 2026 | 12:12 AM
సాంకేతిక సాగు పద్ధతులను అనుసరిస్తే ఆముదం పంటలో అధిక దిగుబడులు సాదించొచ్చని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మి అన్నారు. గురువారం మండలంలోని కామన్‌దొడ్డి గ్రామంలో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం బనవాసి కేవీకే భారత నూనెగింజల పరిశోధన సంస్థ ఐఐవోఆర్ సంయుక్త ఆధ్వర్యంలో అధిక సాంధ్రత ఆముదం పంటపై క్షేత్ర దినోత్సవం నిర్వహించారు.
వ్యవసాయ శాఖ జేడీ వరలక్ష్మి
కోసిగి, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): సాంకేతిక సాగు పద్ధతులను అనుసరిస్తే ఆముదం పంటలో అధిక దిగుబడులు సాదించొచ్చని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మి అన్నారు. గురువారం మండలంలోని కామన్‌దొడ్డి గ్రామంలో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం బనవాసి కేవీకే భారత నూనెగింజల పరిశోధన సంస్థ ఐఐవోఆర్ సంయుక్త ఆధ్వర్యంలో అధిక సాంధ్రత ఆముదం పంటపై క్షేత్ర దినోత్సవం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి ఎం.వరప్రసాద్ అధ్యక్షతన నూనెగింజల సాగుపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టిందని జేడీ వరలక్ష్మి పేర్కొన్నారు. హెచ్‌డీపీఎ్‌స విధానంతో మెరుగైన దిగుబడి అని ప్రధాన శాస్త్రవేత్త డా.పి.లక్ష్మమ్మ అన్నారు. దళిత రైతులకు ఎస్సీ పథకం కింద రైతులకు ఉచితంగా తార్పాలిన్లు, స్పేయర్లను అధికారులు పంపిణీ చేశారు. శాస్త్రవేత్త డా.రమ్య, ఏడీఏ బాలవర్ది రాజు, ఏవో వరప్రసాద్, రైతులు ఉన్నారు