బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం
ABN , Publish Date - Oct 06 , 2026 | 12:37 AM
తాలుకా పోలీస్ స్టేషన్ పరిధిలో పలు కాలనీల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ రాఘవేంద్ర, సీఐ తేజమూర్తి, ఎస్‌ఐ మోహన కిషోర్ రెడ్డి సోమవారం సాయంత్రం నిందితుల వివరాలు వెల్లడించారు.
కర్నూలు క్రైం, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): తాలుకా పోలీస్ స్టేషన్ పరిధిలో పలు కాలనీల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ రాఘవేంద్ర, సీఐ తేజమూర్తి, ఎస్‌ఐ మోహన కిషోర్ రెడ్డి సోమవారం సాయంత్రం నిందితుల వివరాలు వెల్లడించారు. గోస్పాడు మండలం జూలపల్లికి చెందిన శివకుమార్, పసురు పాడు చెందిన వెంకటేశ్వర్లులను అరెస్టు చేశారు. ఈఇద్దరు దిన్నెదేవరపాడు శిల్ప సింగపూర్ టౌన్‌షి్‌ప, బాలాజీ నగర్, భూపాల్‌నగర్, ఎంఎస్-9 కాలనీ, పసుపుల, కాదం బరి టౌన్‌షి్‌ప ప్రాంతాల్లో చోరీలు చేశారు. తాళాలు వేసిన ఇంటిని లక్ష్యంగా చేసుకుని దొంగతనం చేయడంలో వీరు దిట్ట. నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 72 గ్రాముల బంగారు నగలు, 1.5 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు.
చోరీ కేసులో నిందితుడి అరెస్టు
నంద్యాల నూనెపల్లి, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఉదయానంద హాస్పిటల్‌లో రూ.1,40,000 దొంగతనం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద రూ.1,30,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు నంద్యాల మూడో పట్టణ పోలీసుస్టేషన్ సీఐ వేణుగోపాల్ తెలిపారు. వివరాలు.. గత నెల 20వ తేదీ రాత్రి నంద్యాల రైల్వేస్టేషన్ సమీపంలోని ఉదయానంద హాస్పిటల్‌లోని క్యాష్ కౌంటర్ నుంచి రూ.1,40,000 చోరీకి గురైనట్లు బాధితుల ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 4వ తేదీన నంద్యాల నూనెపల్లి ప్లై ఓవర్ బ్రిడ్జి కింద కోవెలకుంట్ల బస్‌స్టాప్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న కడప జిల్లా వేంపల్లికి చెందిన కంభం వెంకటరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తానే దొంగతనానికి పాల్పడినట్లు అతడు వెల్లడించాడు. రూ.1,30,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన రూ.10వేలు తన వ్యక్తిగత ఖర్చులకు, క్రికెట్ బెట్టింగ్‌కు వినియోగించినట్లు నిందితుడు వెల్లడించారు. కేసు ఛేదించిన సిబ్బందిని, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ సురేశ్‌ను ఎస్పీ సునీల్‌షెరాన్, ఏఎస్పీ అభినందించారు.