Share News

గోల్డ్‌ మైన్స్‌ కంపెనీ పర్యావరణ స్పృహ భేష్‌

ABN , Publish Date - Oct 08 , 2026 | 12:20 AM

స్వర్ణగిరి గోల్డ్‌ మైన్స్‌ కంపెనీ పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచడంలో చాలా చురుగ్గా పని చేస్తున్నారని, మరిన్ని మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌ పి. కృష్ణయ్య అన్నారు.

గోల్డ్‌ మైన్స్‌ కంపెనీ పర్యావరణ స్పృహ భేష్‌
స్వర్ణగిరి గోల్డ్‌ మైన్స్‌ను చైర్మన్‌ కృష్ణయ్య

ఏపీ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌ కృష్ణయ్య

తుగ్గలి, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): స్వర్ణగిరి గోల్డ్‌ మైన్స్‌ కంపెనీ పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచడంలో చాలా చురుగ్గా పని చేస్తున్నారని, మరిన్ని మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌ పి. కృష్ణయ్య అన్నారు. బుధవారం మండల పరిధిలోని జొన్నగిరి, పగిడిరాయి గ్రామాల మధ్య ఉన్న జొన్నగిరి గోల్డ్‌ మైన్స్‌ కంపెనీలో ఆయన సందర్శించి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం స్థిరమైన పర్యావరణ నిర్వహణ కోసం కంపెనీ చేపడుతున్న చర్యలు భేష్‌ అన్నారు. కంపెనీ ఆవరణలో 30 ఎకరాల్లో గ్రీన్‌ బెల్డ్‌ ప్రాంతంలో 33,372 మొక్కలను నాటినట్లు గుర్తించామన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్‌ కృష్ణన్‌, ప్రాజెక్టు హెడ్‌ గణేషన్‌, జీఎం బాలాజీ పీఆర్వో రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 08 , 2026 | 12:20 AM