Share News

కామేశ్వరీదేవికి ఆషాడం చీర, సారె

ABN , Publish Date - Jul 19 , 2026 | 11:54 PM

మహానంది క్షేత్రంలోని కామేశ్వరీదేవికి ఆషాడ మాసం పురస్కరించుకొని ఆదివారం చీర, సారె సమర్పించారు.

కామేశ్వరీదేవికి ఆషాడం చీర, సారె
కామేశ్వరీదేవికి ఆషాడం చీర, సారె తెస్తున్న భక్తులు

మహానంది, జూలై 19(ఆంధ్రజ్యోతి): మహానంది క్షేత్రంలోని కామేశ్వరీదేవికి ఆషాడ మాసం పురస్కరించుకొని ఆదివారం చీర, సారె సమర్పించారు. వాసవి క్లబ్‌ అంతర్జాతీయ అధ్యక్షుడు సిద్దా సూర్యప్రకాష్‌ ఆధ్వర్యంలో వందలాది మంది మహిళలు పాల్గొని మహానందీశ్వర స్వామికి పట్టు వస్త్రాలు, కామేశ్వరీదేవికి ఆషాడ మాసం పుట్టింటి చీర, సారె సమర్పించారు. ఆలయం ముఖపంటపం వద్ద పుట్టింటి చీర, సారె తీసుకొచ్చిన మహిళలకు ఏఈవో మధు ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు స్వాగతం పలికారు. కార్యక్రమంలో క్లబ్‌ గవర్నర్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫీసర్లు లింగం శైలజ, మునగనూరి శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 19 , 2026 | 11:54 PM