సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యం: కలెక్టర్
ABN , Publish Date - May 19 , 2026 | 11:29 PM
జిల్లాలో 2029 నాటికి సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యమని కలెక్టర్ ఏ. సిరి సంబంధిత శాఖల అధి కారులను ఆదేశించారు.
కర్నూలు కలెక్టరేట్, మే 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 2029 నాటికి సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యమని కలెక్టర్ ఏ. సిరి సంబంధిత శాఖల అధి కారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో ‘అక్షరాం ధ్ర ఫేజ్-2’ అమలు విధానం, లక్ష్యాలు, శిక్షణ, యాప్ అంశాలపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు మొత్తం 1,87,195 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చే లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిందన్నారు. ఇందులో డీఆర్ డీఏ ఆధ్వ ర్యంలో లక్ష మంది, డ్వామా ద్వారా ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్న నిరక్షరాస్య పురుషులు, పొదుపు సంఘాలకు చెందిన మహిళలు కలిపి 42,195 మంది, మెప్మా ఆధ్వర్యంలో 45వేల మంది మహిళలకు అక్షరాస్యత కల్పించాల్సి ఉందన్నారు. అక్షరాంధ్ర యాప్ ద్వారా లర్నర్లు బోధకులను అనుసంధానం చేసే ప్రక్రియను మే 20వ తేదీ నుంచి ప్రారంభించి వచ్చే నెల 10వ తేదీలోపు పూర్తి చేయాలని స్పష్టంచేశారు. జూలై 20 నుంచి జిల్లా వ్యాప్తంగా అక్షరాంధ్ర తరగతులు ప్రారంభమవు తాయన్నారు. డీడీ అడల్ట్ ఎడ్యుకేషన్ చంద్రశేఖర్ రెడ్డి, జడ్పీ సీఈవో రమణారెడ్డి, డీపీవో భాస్కర్, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ కే.విజయ, జిల్లా స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు అధికారి భాస్కర్ పాల్గొన్నారు.