Share News

పని చేయలేకుంటే బదిలీపై వెళ్లిపోండి

ABN , Publish Date - Mar 12 , 2026 | 12:35 AM

పనిచేయలేని, గ్రామల్లో సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు బదిలీపై వెళ్లిపోవాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పని చేయలేకుంటే బదిలీపై వెళ్లిపోండి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

అధికారులపై ఎమ్మెల్యే అఖిప్రియ ఆగ్రహం

ఆళ్లగడ్డ, మార్చి 11(ఆంధ్రజ్యోతి): పనిచేయలేని, గ్రామల్లో సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు బదిలీపై వెళ్లిపోవాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మండల పరిషత్‌ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. సచివాలయ ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉంటూ అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. కొంతమంది ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్నారని, గ్రామ నాయకులతో సమన్వయం చేసుకుని పనిచెయ్యలేని వారిని తానే బదిలీ చేయిస్తానని హెచ్చరించారు. అనంతరం నాయకులు తమ గ్రామాల సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చారు. వాటిని సాద్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎంపీడీవో నూర్జహాన్‌, తహసీల్దార్‌ జ్యోతి రత్నకుమారి, వివిధ శాఖల అధికారులు, గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2026 | 12:35 AM