జీవో 396ని రద్దు చేయాలి
ABN , Publish Date - Jul 03 , 2026 | 12:18 AM
రిజిసే్ట్రషన సేవా కేంద్రాలను ఏర్పాటు చేసే జీవో 396ని రద్దు చేయాలని కర్నూలు దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
కల్లూరు, జూలై 2 (ఆంధ్రజ్యోతి): రిజిసే్ట్రషన సేవా కేంద్రాలను ఏర్పాటు చేసే జీవో 396ని రద్దు చేయాలని కర్నూలు దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. గురువారం సంఘం ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా రిజిస్ర్టేషన కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం నాయ కులు మాట్లాడుతూ రిజిస్ర్టేషన శాఖ సేవలను ప్రైవేట్ పరం చేయ వద్దని, దస్తావేజు లేఖరుల లైసెన్సులు పునరుద్ధరించాలని ప్రభుత్వా న్ని కోరారు. అనంతరం కర్నూలు, కల్లూరు సబ్-రిజిసా్ట్రర్లకు వినతిప త్రాలు అందజేశారు. కార్యక్రమంలో చందు, రామకృష్ణ, రెహమాన, మ హమ్మద్‌రఫీ, హనుమంతరావు, మస్తాన, నాగేశ్వరరావు పాల్గొన్నారు.