సరిపడినంత ఆహారం ఇవ్వాలి
ABN , Publish Date - Mar 18 , 2026 | 12:09 AM
విద్యార్థులకు సరిపడినంతగా, నాణ్యమైన భోజనం పెట్టాలని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్ది ఆదేశించారు. మంగళవారం పట్టణంలోని ఇల్లూరుకొత్తపేట జడ్పీ ఉన్నతపాఠశాలను తనిఖీ చేశారు.
ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశం
బనగానపల్లె, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు సరిపడినంతగా, నాణ్యమైన భోజనం పెట్టాలని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్ది ఆదేశించారు. మంగళవారం పట్టణంలోని ఇల్లూరుకొత్తపేట జడ్పీ ఉన్నతపాఠశాలను తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం నాణ్యతా ప్రమాణాలను స్వయంగా పరిశీలించారు. అనంతరం పాఠశాల ప్రాంగణం, మైదానాన్ని పరిశీలించి, తన సొంత నిధులతో వంటగది, ఆర్‌వో ప్లాంటును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఇల్లూరుకొత్తపేట గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేసి, ప్రజలకు అందుతున్న సేవల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. హాజరు పట్టిను తనిఖీ చేశారు. సచివాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, రోగులకు నాణ్యమైన సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు.
ప్రభుత్వ వైద్యశాల పరిశీలన..
పట్టణంలోని ఏరియా ఆసుపత్రిని మంత్రి తనిఖీ చేసి. సదుపాయాలు, అత్యాధునిక వైద్య పరికరాల ఏర్పాటుపై సిబ్బందితో చర్చించారు. బ్లడ్‌బ్యాంకు, ల్యాబ్‌ను స్వయంగా పరిశీలిచారు. ఆసుపత్రి అభివృద్ధికి సహకరిఆ్తమన్నారు. రోగులను కలిసి, వైద్యసేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సూపరింటెండెంట్ డాక్టర్ షబానా, వైద్యులు పాల్గొన్నారు.