Share News

పింఛన్‌ ఇప్పించండి సారూ...!

ABN , Publish Date - Mar 16 , 2026 | 11:30 PM

పింఛన్‌ ఇప్పిం చండి సారూ అంటూ వృద్ధ దంపతులు సోమవారం తహ సీల్దార్‌ కార్యాలయం ముందు దీక్ష చేపట్టారు.

పింఛన్‌ ఇప్పించండి సారూ...!
పింఛన్‌ కోసం కార్యాలయం వద్ద దీక్ష చేపట్టిన వృద్ధ దంపతులు

తహసీల్దార్‌ కార్యాలయం ముందు వృద్ధ దంపతుల దీక్ష

మద్దికెర, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): పింఛన్‌ ఇప్పిం చండి సారూ అంటూ వృద్ధ దంపతులు సోమవారం తహ సీల్దార్‌ కార్యాలయం ముందు దీక్ష చేపట్టారు. వయోభారం మీద పడిందని, ఏపనీ చేయలేమని, తెచ్చిపేట్టే వారు ఎవరూ లేదరని ఆవేదన వ్యక్తం చేశారు. మూటాముళ్లతో కార్యాల యం వద్దకు వచ్చారు. ఇక్కడి నుంచి వెళ్లబోమని కన్నీటి పర్యంతమ్యారు. వివరాలవి.. మద్దికెర గ్రామానికి చెందిన బోయ తిమ్మప్ప, రామలక్ష్మి వృద్ధ దంపతులకు పిల్లలు లేరు. పక్షపాతం రావడం వల్ల తిమ్మప్ప నడవలేని పరిస్థితి. దీంతో కుటుంబ పోషణ భారంగా మారింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పింఛన్‌ తొలగించారు. ఆనాటి నుంచి నేటి వరకు పింఛన్‌ కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నా కూడా ఎవరూ పట్టించుకోకపోవడంతో సోమవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ముందు వృద్ధ దంపతులు ఇద్దరు దీక్షకు పూనుకున్నారు. వారు మాట్లాడుతూ సుమారు ఐదేళ్ల క్రితం తమ పింఛన్‌ తొలగించారని, ఆనాటి నుంచి నేటి వరకు నాయకులు, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు పింఛన్‌ ఇచ్చేవరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదని భీష్మించి కూర్చున్నారు. తహసీల్దార్‌ గూండాల్‌ నాయక్‌, డిప్యూటీ ఎంపీడీవో కొండయ్య కలుగ జేసుకుని.. ప్రభుత్వం కొత్త పింఛన్ల దరఖాస్తు ఆన్‌లైన్‌లో అవకాశం కల్పించలేదని, సదరం క్యాంపు ద్వారా మీకు పింఛన్‌ వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో వృద్ధ దంపతులు దీక్ష విరమించి వెళ్లిపోయారు.

Updated Date - Mar 16 , 2026 | 11:30 PM