పేదలందరికీ ఇంటి పట్టాలు ఇస్తాం
ABN , Publish Date - Apr 02 , 2026 | 12:19 AM
పట్టణంలో నిరుపేదలందరికీ ఇంటి పట్టాలు పంపిణీ చేస్తామని ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణ సమీపంలోని అవుకు మెట్ట ప్రాంతంలోని ఎస్సార్బీసీ కాలనీవద్ద పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు జంగిల్ క్లియరెన్స్ పనులను మంత్రి ప్రారంభించారు.
మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
బనగానపల్లె, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో నిరుపేదలందరికీ ఇంటి పట్టాలు పంపిణీ చేస్తామని ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణ సమీపంలోని అవుకు మెట్ట ప్రాంతంలోని ఎస్సార్బీసీ కాలనీవద్ద పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు జంగిల్ క్లియరెన్స్ పనులను మంత్రి ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచికచన హామీ మేరకు కార్యాచరణ పనులు ప్రారంభించామన్నారు. ఎస్సార్బీసీ, ఆలయాల, ప్రైవేటు భూములను ఎంపిక చేశామని, భూములు బదలాయింపు ప్రక్రియలో భాగంగా అనుమతులకోసం ప్రభుత్వానికి నివేదిక పంపామన్నారు. అనుమతి రాగానే లేఅవుట్లు వేసి, లబ్దిదారులకు పట్టాలు అందజేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో నరేంద్రనాథరెడ్డి, తహసీలార్ నారాయణరెడ్డి, హౌసింగ్ డీఈ కృష్ణారెడ్డి, ఏఈ బాలచంద్రుడు, పంచాయతీరాజ్ డీఈ నాగశ్రీనివాసులు, ఏఈ రమణ, మార్కెట్‌యార్డు చైర్మన్ కాట్రెడ్డి మల్లిఖార్జునరెడ్డి, ఉపసర్పంచ్ బురానుద్దీన్, కాశీంభాష, అమర్‌నాథరెడ్డి, రాయలసీమ సలాం, గౌండాబాబు పాల్గొన్నారు.