Share News

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి దీక్ష

ABN , Publish Date - May 15 , 2026 | 11:44 PM

నీవే నాప్రాణం అని.. నీవు లేనిది జీవితం లేదని బాసలు చేశాడు. నాలుగేళ్లుగా ఒకరికొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. ప్రేమలో హద్దులు దాటారు. ఇప్పుడు అంతా అయిపోయాక పెళ్లి ప్రస్తావన రాగానే మొహం చాటేశాడు. కులాల వేరని, ఇంట్లో పెద్దలు ఒప్పుకోవడం లేదని ప్లేటు ఫిరాయించాడు. పెళ్లి చేసుకోవాల్సిందేనని ప్రియు రాలు మొండికేసి అతడి ఇంటి ముందు దీక్షకు సిద్ధమైంది. దీంతో ఆ కుటుంబమంతా ఇంటికి తాళం వేసి నాయకుల వద్ద పంచాయితీకి సిద్ధమయ్యారు. ఆ పెద్ద మనుషులు ప్రేమకు వెల కట్టారు. తనకు డబ్బు వద్దు.. న్యాయం కావాలని ఆమె దీక్ష కొనసాగిస్తోంది.

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి దీక్ష
దీక్షచేస్తున్న యువతి

ఇంటికి తాళం వేసి వెళ్లిపోయిన యువకుడు

ప్రేమకు వెల కట్టిన పెద్దమనుషులు

న్యాయం కావాలంటున్న బాధితురాలు

మంత్రాలయం, మే 15(ఆంధ్రజ్యోతి): ప్రేమించానని నమ్మించి మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందు ఓప్రియురాలు దీక్షకు కూర్చుంది. వివరాలు.. మండలంలోని సూగూరు గ్రామానికి చెందిన కురువ మునెప్ప కుమారుడు మురళికృష్ణ అదే గ్రామానికి చెందిన చాకలి శశికళ అనే యువతి నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. అతడు పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. రెండుసార్లు గర్భస్రావం కూడా చేయించాడు. కొన్ని రోజుల నుంచి పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి చేసింది. కులాలు వేరు కావడంతో మా ఇంట్లో పెద్దలు ఒప్పుకోవడం లేదని తప్పించుకు తిరుగుతున్నాడు. రెండు రోజుల క్రితం ప్రియురాలు పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదుచేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని వాపోయింది. విసిగిపోయిన ఆయువతి మురళికృష్ణ ఇంటిముందు దీక్ష చేపట్టింది. పెళ్లిచేసుకోవాలని పట్టుబట్టింది. ఇది తెలుసుకున్న ఆ యువకుడు, వారి తల్లిద్రండులు ఇంటికి తాళం వేసి వెళ్లారు. రాజకీయ నాయకులను ఆశ్రయిం చారు. పెద్దమనుషులతో పంచాయితీ చేద్దామన్నారు.

పెళ్లి చేసుకోవాల్సిందేనని..

పెద్దమనుషులతో పంచాయితీ చేద్దామని రూ.5లక్షలు ఇప్పిస్తామని ఒత్తిడి తెస్తుస్తున్నారని బాధితురాలు పేర్కొంది. ప్రేమించానని నమ్మించి మోసం చేశాడని, తనకు డబ్బు అవసరం లేదు అంది. న్యాయం కావాలని దీక్ష కొనసాగిస్తోంది. పెద్దలు తన కష్టాన్ని అర్ధం చేసుకొని పెళ్లి చేసి న్యాయం చేయాల్సిందిగా వేడుకుంటోంది.

Updated Date - May 15 , 2026 | 11:44 PM