శ్రీశైలంలో గిరి ప్రదక్షిణ
ABN , Publish Date - Oct 25 , 2026 | 11:47 PM
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు పౌర్ణమి ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు.
స్వామి, అమ్మవార్లకు పౌర్ణమి పూజలు
శ్రీశైలం, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు పౌర్ణమి ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. ఆదివారం సాయంత్రం మంగళహారతుల తరువాత ఆది దంపతుల గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని చైర్మన్ రమేశ్ నాయుడు ప్రారంభించారు. గంగాధర మండపం వద్ద ధర్మప్రచార రథంపై ఆశీనులైన స్వామి, అమ్మవార్లకు షోడశోపచార పూజలు చేసిన అర్చక వేదపండితులు అంకాళమ్మ ఆలయం మీదుగా వలయ రహదారి వెంట గిరి ప్రదక్షిణ చేశారు. అదే విధంగా అమ్మవారి ఆలయంలో ఊయలసేవ పల్లకిసేవలను వైభవంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులతో శ్రీగిరి క్షేత్రం సందడిగా మారింది.