Share News

తట్టు, రూబెల్లా టీకా వేయించాలి

ABN , Publish Date - Jan 08 , 2026 | 12:34 AM

తట్టు, రూబెల్లా టీకాలు తప్పవ వేయించాలని జిల్లా నోడల్‌ అధికారి డాక్టర్‌ రఘు సూచించారు. బుధవారం ప్యాలకుర్తి ఆరోగ్య మందిర్‌లో సంచార చికిత్సను తనిఖీ చేశారు.

తట్టు, రూబెల్లా టీకా వేయించాలి
వివరాలు తెలుసుకుంటున్న నోడల్‌ అధికారి డాక్టర్‌ రఘు

జిల్లా నోడల్‌ అధికారి డాక్టర్‌ రఘు

కోడుమూరు రూరల్‌, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): తట్టు, రూబెల్లా టీకాలు తప్పవ వేయించాలని జిల్లా నోడల్‌ అధికారి డాక్టర్‌ రఘు సూచించారు. బుధవారం ప్యాలకుర్తి ఆరోగ్య మందిర్‌లో సంచార చికిత్సను తనిఖీ చేశారు. బాలింతలు, గర్బిణులకు వ్యాధి నిరోధక టీకాలపై అవగాహన కల్పించారు. గర్భిణులకు రూబెల్లా సోకితే పుట్టబోయే బిడ్డకు కంటి సమస్యలు, వినికిడిలోపం, మెదడు, గుండె సంబంధిత లోపాలు ఏర్పడతాయన్నారు. కొన్ని సందర్భాల్లో మృతశిశువు జన్మించే ప్రమాదం ఉందన్నారు. తట్టు ప్రాణాంతక వ్యాధి అని చిన్నారుల్లో న్యూమోనియా, విరేచనాలు, మెదడువాపు వ్యాధులకు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. దగ్గడం, తుమ్మినప్పుడు తుంపర్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుందన్నారు. తట్టు, రూబెల్లా నివారణకు 9 నెలల నుంచి ఏడాది వయసులో 1డోస్‌ మరలా 24 నెలల వయసులో రెండో డోస్‌ వేయించాలని తెలిపారు. డీపీఎం డాక్టర్‌ శైలే్‌షకుమార్‌ మాట్లాడుతూ 5,10,16 సంవత్సరాల వయసు వారీగా అన్నిరకాల వ్యాక్సినేషన్లు నమోదు చేయాలని, గర్భిణిలకు టీడీ రెండో డోసు వ్యాక్సిన్‌తో పాటు ఐరన్‌ మాత్రలు అందించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో డాక్టర్‌ షఫియాబేగం, డీహెచ్‌ఈవో కృష్ణారెడ్డి సిబ్బంది రామకృష్ణ, మహమూద్‌, సరస్వతి, సువర్ణమ్మ, విజయలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - Jan 08 , 2026 | 12:34 AM