నైపుణ్యాలతో ఉద్యోగాలు సాధించాలి
ABN , Publish Date - Mar 30 , 2026 | 11:42 PM
యువతీ యువకులు తగిన నైపుణ్యాలతో ఉద్యోగాలు సాధించాలని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు.
పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత
కర్నూలు ఎడ్యుకేషన, మార్చి 30(ఆంధ్రజ్యోతి): యువతీ యువకులు తగిన నైపుణ్యాలతో ఉద్యోగాలు సాధించాలని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు. సోమవారం స్థానిక బి.క్యాంపు ప్రభు త్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో జాబ్‌మేళాను ఆయన ప్రారం భించి మాట్లాడారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వస్తే.. ఆ కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుందని అన్నారు. 17 కంపెనీలలో 1125 ఉద్యోగాలను ఈ జాబ్‌మేళా ద్వారా భర్తీ చేస్తున్నామన్నారు. ఓర్వకల్లుకు గతంలో ఎన్నడూ లేనివిధంగా కంపెనీలు తీసుకువస్తున్నా మన్నారు. జైరాజ్ ఇస్పాత కంపెనీని అప్పట్లోనే సీఎం చంద్రబాబు తీసుకువ చ్చారని, ఇప్పుడు అదే కంపెనీ రూ.6వేల కోట్లతో పెట్టుబడి పెడుతుందని అన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ నాయక త్వంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా తాము పని చేస్తున్నామన్నారు. కార్యక్ర మంలో జిల్లా ఎంప్లాయ్‌మెంటు ఆఫీసర్ దీప్తి, కళాశాల ప్రిన్సిపాల్ నాగస్వామి నాయక్, డీఎస్పీ మహబూబ్ బాషా, ఏపీఐఐటీ డైరెక్టర్ జగదీష్ గుప్తా, అధ్యాపకులు, నిరుద్యోగ యువత పాల్గొన్నారు.