Share News

సైక్లింగ్‌ అలవాటు చేసుకోండి

ABN , Publish Date - Jun 08 , 2026 | 12:04 AM

ప్రతి ఒక్కరూ సైక్లింగ్‌, వ్యాయామాన్ని అలవాటుగా చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ తెలిపారు.

సైక్లింగ్‌ అలవాటు చేసుకోండి
ర్యాలీ ప్రారంభిస్తున్న అడిషనల్‌ ఎస్పీ హుస్సేన్‌ పీరా

ఫిట్‌ ఇండియా సండేస్‌ ఆన్‌ సైకిల్‌ ప్రారంభం

కర్నూలు క్రైం, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ సైక్లింగ్‌, వ్యాయామాన్ని అలవాటుగా చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ తెలిపారు. ఆదివారం స్థానిక కొండారెడ్డి బురుజు వద్ద ఫిట్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా సండేస్‌ ఆన్‌ సైకిల్‌ కార్యక్రమాన్ని అడిషనల్‌ ఎస్పీ అడ్మిన్‌ హుస్సేన్‌ పీరా, ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ కృష్ణమహన్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సైకిల్‌ ర్యాలీ కొండారెడ్డి బురుజు వద్ద ప్రారంభమై ఓల్డ్‌ కంట్రోల్‌ రూమ్‌, కిడ్స్‌ వరల్డ్‌, రాజ్‌విహార్‌ మీదుగా జిల్లా పోలీస్‌ కార్యాలయానికి చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సైక్లింగ్‌ వల్ల శారీరక దృఢత్వం పెరగడంతో పాటు వాహన కాలుష్యం తగ్గి పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీలతో సాటు సీఐలు గుణశేఖర్‌బాబు, పార్థసారధి, ఆర్‌ఐలు నారాయణ, పోతులరాజు, ఆర్‌ఎస్‌ఐలు, ఏఆర్‌ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 08 , 2026 | 12:04 AM