జీడీపీ నీరు విడుదల
ABN , Publish Date - Oct 09 , 2026 | 12:42 AM
cప్రస్తుతం జీడీపీలో 2.2 టీఎంసీ నీరు మాత్రమే ఉంది. హంద్రీనీవా నుంచి ప్రస్తుతం జీడీపీకి 250 క్యూసెక్కుల వరకు వచ్చి చేరుతోంది.
కర్నూలు నగరానికి నీటి విడుదలను ఆపేసిన అధికారులు
మరో వారం రోజులే జీడీపీకి హంద్రీ నీవా నీరు
గోనెగండ్ల, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): cప్రస్తుతం జీడీపీలో 2.2 టీఎంసీ నీరు మాత్రమే ఉంది. హంద్రీనీవా నుంచి ప్రస్తుతం జీడీపీకి 250 క్యూసెక్కుల వరకు వచ్చి చేరుతోంది. అయితే హంద్రీనీవా నీరు మరో వారం రోజుల్లో నిలిచిపోనున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. ఈ నెల 15 వ తేది వరకు హంద్రీనీవా నీరు విడుదల కష్టంగానే ఉందని అధికారులు తెలుపుతున్నారు. శ్రీశైలం డ్యామ్‌లో ప్రస్తుతం 74.9 టీఎంసీ నీరు మాత్రమే ఉందని తెలుస్తుంది. శ్రీశైలం డ్యామ్ నుంచి తెలంగాణ, ఆంధ్రవాటాగా ఇతరత్రాఅవసరాలకు రోజుకు 3 నుంచి 4 టీఎంసీల నీటిని వాడుతున్నట్లు తెలుస్తుంది. ఇక శ్రీశైలండ్యామ్ 60 టీఎంసీ లకు రాగానే ఇతర ప్రాంతాలకు నీటి విడుదలను డ్యామ్ అధికారులు నిలిపివేయన్నుట్లు అధికారులు తెలుపుతున్నారు. తుంగభద్ర నీరు సుంకేసుల డ్యామ్‌కు చేరడంతో కర్నూలుకు జీడీపీ నీటి అవసరం లేక పోవడతో నీటి విడుదలను నిలిపివేసినట్లు జీడీపీ అధికారులు తెలిపారు.
రబీసాగు పట్ల స్పష్టత ఇవ్వాలి
రబీ సీజన్ ప్రారంభం కావడంతో ఆయకట్టు రైతులు నీరు విడుదల చేస్తారా? లేదా? అనే విషయంలో స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 2.2 టీఎంసీల నీటితో రబీ సాగులో 13,000 ఎకరాలకుకు నీటి విడుదల చేయడం కష్టంగా ఉంటుంది. ప్రస్తుతం జీడీపీలో ఉన్న నీటితోనే వచ్చే ఏడాది జూలైలో వర్షాలు వచ్చేవరకు తాగునీటి పథకాలకు మళ్లించాల్సి ఉంది. అదికాక మరి కొత్తగా ఎమ్మిగనూరు పట్టణ ప్రజలకు కోసం రూ.156కోట్లతో ప్రత్యేక నీటి పథకాన్ని ఏర్పాటుచేసి జీడీపీ నుంచి మళ్లించేందుకు పనులు వేగంగా జరుగుతున్నాయి. అధికారులు, నాయకులు సైతం తాగునీటికి మొదటి అవకాశం ఇవ్వడంతో సాగుకు కష్టమనే చెప్పాలి. ఇక రబీకి నీటి విడుదల ప్రశ్నార్థకమే అని భావించవచ్చు. కోడుమూరు, ఎమ్మిగనూరు సెక్షన్‌లకు రోజుకు 90 క్యూసెక్కుల నీరు జీడీపీ ఎడమ కాలువ నుంచి విడుదల చేస్తున్నారు. అలాగే ప్రతి రోజు ఎండ వేడిమికి ప్రాజెక్టులో నీరు 30 నుంచి 50 క్యూసెక్కుల వరకు ఆవిరి రూపంలో వృఽథా అవుతోంది. ప్రాజెక్టు కింద ఉన్న బండగట్టు, డోన్, క్రిష్టగిరి, తాగునీటి పథకాలకు రోజుకు 10 క్యూసెక్కుల నీరు విడుదల చేయాలి. అవసర సమయంలో కర్నూలు, కోడుమూడు, గూడురు, బెళగల్ ప్రాంతాలకు తాగునీటికి విడుదల చేయాలి.