గ్యాస్ ట్రబుల్
ABN , Publish Date - Mar 27 , 2026 | 12:45 AM
మండలంలో గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక సజ్జలగుడ్డం రోడ్డులో ఇండియన్ గ్యాస్ గోడౌన్ వద్ద ప్రజలు బారులు దీరారు.
సిలిండర్ల కోసం బారులు
రోడ్లపైనే ప్రజల నిరీక్షణ
కోసిగి, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): మండలంలో గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక సజ్జలగుడ్డం రోడ్డులో ఇండియన్ గ్యాస్ గోడౌన్ వద్ద ప్రజలు బారులు దీరారు. గురువారం ఉదయం 7 గంటల నుంచే వందలాది మంది ఖాళీ సిలిండర్లతో గ్యాస్ గోడౌన్ వద్దకు చేరుకున్నారు. సిలిండర్లను క్యూలైన్‌లో సుమారు కొన్ని మీటర్లమేర పెట్టారు. ఆన్‌లైన్‌లో కొంతమంది బుకింగ్ చేసినా ఓటీపీ రాకపోవడంతో, మరి కొందరు ఆన్‌లైన్ చేసుకో కపోయినా అక్కడికి వచ్చి సిలిండర్లు అడుగుతున్నారని గ్యాస్ ఏజెన్సీ నిర్వహకులు తెలుపుతు న్నారు. గ్యాస్ కోసం ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకుని ఓటీపీ వచ్చిన తర్వాతనే సిలిండర్లు అందజే యాలని అధికారులు ఆదేశాలిచ్చారన్నారు. ఏదీ ఏమైనా కోసిగిలో గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు పనులు మానుకుని గంటల తరబడివేచి ఉన్నా చివరకు గ్యాస్ సిలిండర్లు కూడా ఇవ్వడం లేదని మహిళలు, యువకులు వాపోతున్నారు. .