రహదారుల పక్కనే చెత్త
ABN , Publish Date - Mar 12 , 2026 | 12:34 AM
మేజర్ గ్రామ పంచాయతీలో డంపింగ్‌యార్డ్ లేకపోవడంతో సిబ్బంది చెత్తాచెదాదాన్ని రహదారులు, ఎన్టీఆర్ లేఔట్‌లో పడేస్తున్నారు
చాగలమర్రి, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): మేజర్ గ్రామ పంచాయతీలో డంపింగ్‌యార్డ్ లేకపోవడంతో సిబ్బంది చెత్తాచెదాదాన్ని రహదారులు, ఎన్టీఆర్ లేఔట్‌లో పడేస్తున్నారు. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. గ్రామంలో మొత్తం జనాభా 38వేలు ఉండా, 20 వార్డులు ఉన్నాయి. మల్లేవేముల రహదారిలో పడేసిన చెత్తకు నిప్పంటించడంతో పొగ అలముకుని వాహనదారులు, పాదచారులు ఇబ్బందులకు గురయ్యారు. గుంతపాలెం వీధిలోని ఎన్టీఆర్ లే అవుట్‌లలో చెత్తను ట్రాక్టర్లతో తెచ్చి పడేస్తున్నారు. గృహాల మధ్యనే చెత్త వేయడం ఎంటని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. తమ గృహాల వద్దకు వెళ్లేందుకు వీలు లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ పాలకవర్గం, అధికారులు స్పందించి డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.